రజినీకాంత్ కోసం శ్రీదేవి ఉపవాసం..!

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కోసం దివంగత నటి శ్రీదేవి ఉపవాసం చేశారు. 

Last Updated : Feb 27, 2018, 03:29 PM IST
రజినీకాంత్ కోసం శ్రీదేవి ఉపవాసం..!

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కోసం దివంగత నటి శ్రీదేవి ఉపవాసం చేశారు. రజినీకాంత్‌ ‘కొచ్చాడాయన్‌’ సినిమాలో నటిస్తున్నప్పుడు తీవ్ర అనారోగ్యం చెందారు. దాంతో ఆయనకి మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన్ను సింగపూర్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి శ్రీదేవి బాధపడ్డారట. ఆయన తొందరగా కోలుకోవాలని సాయిబాబాకు పూజలు చేశారని, వారం రోజుల పాటు ఉపవాసం కూడా ఉన్నారని, రజినీ కోలుకునేవరకు శ్రీదేవి ఈ విషయం బయటికి చెప్పలేదని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న రజనీ అభిమానులు శ్రీదేవికి సోషల్ మీడియాలో 'థాంక్స్' కూడా చెప్పారని వెల్లడించింది. 

రజినీకాంత్, శ్రీదేవి కలిసి సుమారు 20 చిత్రాల్లో నటించారు. శ్రీదేవి చనిపోయారని తెలిసి రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. దేశం ఓ గొప్ప సూపర్‌స్టార్‌ను కోల్పోయిందని, తాను మంచి స్నేహితురాలిని కోల్పోయానని రజినీకాంత్  పేర్కొన్నారు.

Trending News