Aditya Narayan Love Marriage: ప్రేమ పెళ్లికి సిద్ధమైన ఫేమస్ సింగర్

టాలీవుడ్, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలకు పని పరంగా కలిసి రానప్పటికీ.. వ్యక్తిగత జీవితాలకు ఎంతో ప్లస్ పాయింట్ అయింది. పలువురు లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచీ పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు.

Last Updated : Nov 29, 2020, 04:48 PM IST
  • టాలీవుడ్ సెలబ్రిటీల బాటలోనే బాలీవుడ్ సింగర్ ఆదిత్య నారాయణ్
  • డిసెంబర్ 1వ తేదీన పెళ్లి పీటలు ఎక్కనున్న ఫేమస్ సింగర్
Aditya Narayan Love Marriage: ప్రేమ పెళ్లికి సిద్ధమైన ఫేమస్ సింగర్

కరోనా వైరస్ ఈ ఏడాది ప్రపంచ దేశాలను చాలా ఇబ్బందులకు గురి చేసింది. అయితే మన దగ్గర మాత్రం టాలీవుడ్, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలకు పని పరంగా కలిసి రానప్పటికీ.. వ్యక్తిగత జీవితాలకు ఎంతో ప్లస్ పాయింట్ అయింది. పలువురు లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచీ పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు. తాజాగా మరో సినీ సెలబ్రిటీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.

 

డిసెంబర్ 1న ప్రేమ పెళ్లి చేసుకునేందుకు బాలీవుడ్ సింగర్ ఆదిత్య నారాయణ్ సిద్ధంగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా శ్వేతా అగ‌ర్వాల్‌, ఆదిత్య నారాయణ్ ప్రేమించుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల సింగర్ మీడియాకు తెలిపాడు. టాలీవుడ్ సెలబ్రిటీల బాటలోనే బాలీవుడ్ సింగర్, హోస్ట్ ఆదిత్య నారాయణ్ నడవనున్నాడు. ఆదిత్య, శ్వేతా అగర్వాల్‌లకు 12 ఏళ్లుగా పరిచయం ఉంది.

Chiranjeevi: డైరెక్టర్ రాజమౌళి అడగ్గానే చిరంజీవి ఒప్పుకున్నారా!

 

ఈ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లాడు. కరోనా నేపథ్యంలో జరుగుతున్న వివాహం కనుక.. డిసెంబ‌ర్ 1న కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకోనున్నట్లు ఇటీవల తెలిపాడు. పెళ్లికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో తెలియజేశాడు సింగర్ ఆదిత్య. 

Bigg Boss Telugu 4: కంటెస్టెంట్ Monal Gajjar ప్రతి వారం ఎలా సేవ్ అవుతుందో తెలుసా? 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News