సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్‌ను ధ్వంసం చేయడంతో పాటు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టులు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తీవ్రంగా శ్రమించి ఏర్పాటు చేసుకున్న సెట్‌ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి
మిన్నల్ మురళీ సినిమా కోసం చర్చి సెట్ రూపొందించారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా కలడీలో వేసిన చర్చి సెట్‌ను అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ (AHP) సభ్యులు కొందరు ధ్వంసం చేశారు. పెరియార్ నది తీరాన జగద్గురు ఆది శంకరాచర్య మఠానికి సమీపంలో కలడీలో నిర్మించిన సెట్ ధ్వసం చేయడంతో పాటు సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయగా వివాదం మరింతగా ముదిరింది. మల్టీ టాలెంటెడ్ భానుశ్రీ లవ్లీ ఫొటోషూట్
కేసు నమోదు చేసుకున్న పెరంబవూర్ పోలీసులు రతీష్ అనే వ్యక్తిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వదిలి పెట్టవద్దని కేరళ సీఎం పినరయి విజయన్ సైతం స్పందించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు స్థానిక అధికారుల వద్ద నుంచి అనుమతి తీసుకుని నిర్మించిన చర్చి సెట్‌ను ఏహెచ్‌పీ సభ్యులు ధ్వసం చేయడం దారుణమని మిన్నల్ మురళీ సినిమా నిర్మాత సోఫియా పాల్ అన్నారు. రెండేళ్లు శ్రమించి సినిమా తీస్తున్నామని, ఇలా చేయడం సరికాదంటూ వాపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..