బాలీవుడ్ స్టార్ హీరో కంట్లో పడిన మహర్షి

మ‌హేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఈ చిత్రం రూ. 200 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టే అవకాశాలున్నాయని బాక్సాఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Last Updated : May 20, 2019, 12:07 AM IST
బాలీవుడ్ స్టార్ హీరో కంట్లో పడిన మహర్షి

మ‌హేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఈ చిత్రం రూ. 200 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టే అవకాశాలున్నాయని బాక్సాఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఈ సినిమాపై కన్నేసినట్టు తెలుస్తోంది. మహర్షి సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ సల్మాన్ ఖాన్‌ని బాగా ఆకట్టుకుందట. అందుకే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాల‌ని భావిస్తోన్న సల్మాన్ ఖాన్ ఇప్ప‌టికే రీమేక్‌కి సంబంధించిన చర్చలు సైతం ప్రారంభించిన‌ట్టు సినీవర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. 

ఈ సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించడానికి స‌ల్మాన్‌, ప్ర‌భుదేవా ప్రయత్నిస్తున్నారని.. అది కానీ వారికి నచ్చినట్టయితే, హిందీలో మహర్షి రీమేక్ సెట్స్‌పైకి వెళ్ళ‌డం ఖాయ‌మ‌నేది టాలీవుడ్ టాక్. స‌ల్మాన్ ఖాన్ గతంలో మహేశ్‌బాబు ‘పోకిరి’ని హిందీలో ‘వాంటెడ్‌’ పేరుతో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఇదేకాకుండా రవితేజ నటించిన కిక్ సినిమాను సైతం సల్మాన్ అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశాడు. అందుకే మహర్షి సైతం హిందీలో రీమేక్ అయ్యే అవకాశాలు లేకపోలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Trending News