కోహ్లీకి చేరువలో ప్రియాంక చోప్రా...

న్యూ ఢిల్లీ: ఇన్ స్టాగ్రామ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుసరించే వారి సంఖ్య 50.3 మిలియన్లు. అయితే ఇండియాలో ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో విరాట్ కోహ్లీనే నెంబర్ వన్ గా ఉన్నాడని ఇటీవలి సంగతి. కాగా, బాలీవుడ్ బామ, 

Last Updated : Feb 21, 2020, 10:48 PM IST
కోహ్లీకి చేరువలో ప్రియాంక చోప్రా...

న్యూ ఢిల్లీ: ఇన్ స్టాగ్రామ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుసరించే వారి సంఖ్య 50.3 మిలియన్లు. అయితే ఇండియాలో ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో విరాట్ కోహ్లీనే నెంబర్ వన్ గా ఉన్నాడని ఇటీవలి సంగతి. కాగా, బాలీవుడ్ బామ, అందాలతార ప్రియాంక చోప్రా కూడా హాఫ్ సెంచరీ మైలురాయి అందుకుంది. ప్రియాంక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 మిలియన్లకు చేరింది.

దేశంలో కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన సెలబ్రిటీ ప్రియాంక చోప్రాయే. వీరిద్దరి తర్వాత స్థానంలో బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి మస్తానీ, (దీపిక పదుకొనే) 44.2 మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉంది. అయితే, ప్రియాంక చోప్రా బాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా హాలీవుడ్ సినిమాల్లోనూ, అమెరికా వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. నటగాయకుడు నిక్ జోనాస్ ను వివాహమాడిన తర్వాత ప్రియాంక అభిమానగణం మరింత పెరిగింది. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News