PPF Scheme New Update: దేశంలో ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతోంది. అదేవిధంగా ప్రజలకు భవిష్యత్ అవసరాలకు ప్రోత్సహించే దిశగా కూడా అడుగులు వేస్తోంది. వీటిలో ఎక్కువ మంది ఆకర్షితులైన పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపెట్టేందుకు చాలామంది ప్రజలు ఆసక్తికనబరుస్తున్నారు. పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండడంతోపాటు ఎక్కువ రాబడి వస్తుండడంతో అందరినీ ఆకర్షిస్తోంది పీపీఎఫ్.
పీపీఎఫ్ పథకాన్ని 1968లో ఆర్థిక మంత్రిత్వ శాఖ నేషనల్ సేవింగ్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రారంభించింది. ఇందులో ప్రజలు దీర్ఘకాలానికి డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పథకం ద్వారా పెట్టుబడితో పాటు ట్యాక్స్‌ను సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 7.10 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతోంది. అయితే ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తారు. అవసరమైతే వడ్డీ రేటును కూడా మార్చవచ్చు. పీపీఎఫ్‌పై వడ్డీ రేట్లు 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ రాబడితో ముడిపడి ఉన్నాయి. గత మూడు నెలల్లో సగటు బాండ్ రాబడి ఆధారంగా త్రైమాసికం ప్రారంభంలో పీపీఎఫ్ వడ్డీ రేటును నిర్ణయిస్తారు.
మీరు కనీసం ఒకసారి సంవత్సరంలో పీపీఎఫ్ రూ.500 వరకు పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేస్తే.. మీరు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఈ పథకానికి 15 సంవత్సరాల మెచ్యూరిటీ సమయం ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత.. ఈ పథకాన్ని ఐదేళ్ల బ్లాక్ సమయం ప్రకారం పొడిగించవచ్చు. మెచ్యూర్ అయిన తర్వాత మీరు పీపీఎఫ్ ఖాతా నుంచి మీ డబ్బును విత్‌డ్రా చేసుకోకపోతే.. డిఫాల్ట్‌గా ఖాతా పొడిగిస్తారు.
అయితే పీపీఎఫ్ కార్పస్ ప్రభుత్వం పొడిగించిన వ్యవధిలో వడ్డీ రేటు అప్పుడు ఉన్నదాని కంటే తగ్గుతుంది. పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ అయిన తరువాత ఖాతాను క్లోజ్ చేసుకోవడమే ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. మీరు పీపీఎఫ్ మెచ్యూరిటీ కంటే ముందు కొంత డబ్బు డ్రా చేయలనుకుంటే.. ఇన్వెస్ట్ చేసిన 6వ సంవత్సరం తరువాత అకౌంట్ నుంచి తీసుకోవచ్చు. పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు ఎమర్జెన్సీ సమయంలో డబ్బులు తీసుకునేందుకు పర్మిషన్ ఉంది. అయితే మొత్తం విత్ డ్రా చేసుకునేందుకు వీలుండదు. మీరు నాలుగో ఏడాది తరువాత ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్లో నుంచి 50 శాతం మాత్రమే తీసుకోవచ్చు.
Also Read: Dogs Attack on Boy: తెలంగాణలో దారుణం.. కుక్కల దాడిలో మరో బాలుడు మృతి
Also Read: Ex Minister Vijaya Rama Rao: మాజీ మంత్రి కన్నుమూత.. టీఆర్ఎస్ ఏర్పాటుకు కారణం ఆయనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook