"సైరా"లో నాగబాబు కూతురు నటిస్తోందా..?

మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల తన పెదనాన్న చిరంజీవి నటిస్తోన్న "సైరా" చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుందని పలు వార్తలు వస్తున్నాయి. 

Last Updated : Apr 5, 2018, 01:37 PM IST
"సైరా"లో నాగబాబు కూతురు నటిస్తోందా..?

మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల తన పెదనాన్న చిరంజీవి నటిస్తోన్న "సైరా" చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుందని పలు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం "సైరా" షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొంటున్నారు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఇదే చిత్రంలో ఓ పాత్ర కోసం నిహారికను కూడా ఎంపిక చేశారనే వార్త టాలీవుడ్‌లో హల్చల్ చేస్తుంది. నిహారిక గతంలో "ఒక మనసు" అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత తన తండ్రి నాగబాబుతో కలిసి "నాన్న కూచి" అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. ప్రస్తుతం ఓ తమిళ సినిమాతో పాటు హ్యాపీ వెడ్డింగ్ అనే చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు.

Trending News