నాగ్ పుట్టినరోజు సందర్భంగా "దేవదాస్" సినిమా కొత్త స్టిల్స్ విడుదల

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న "దేవదాస్" చిత్రంలోని కొత్త చిత్రాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు నిర్మాతలు

Last Updated : Aug 28, 2018, 09:06 PM IST
నాగ్ పుట్టినరోజు సందర్భంగా "దేవదాస్" సినిమా కొత్త స్టిల్స్ విడుదల

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న "దేవదాస్" చిత్రంలోని కొత్త స్టిల్స్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు నిర్మాతలు. నాగార్జున‌, నాని కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక, ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనిదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అంటున్నారు నిర్మాతలు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి చాలా మంచి రెస్పాన్సే వచ్చింది. పూర్తిస్థాయి కామెడీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగార్జున చాలా యంగ్ లుక్‌‌తో కనిపించడం విశేషం. ఈ చిత్రంలో నాగ్ పాత్ర పేరు దేవ్.. కాగా నాని పాత్ర పేరు దాస్. వెన్నెల కిషోర్, రావు రమేష్, వికే నరేష్, శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. తొలుత వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. తర్వాత మళ్లీ వేరే రిలీజ్ డేట్ ప్లాన్ చేశారు నిర్మాతలు. 

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శ్రీరామ్ ఆదిత్య గతంలో శమంతకమణి, భలే మంచి రోజు సినిమాలకు దర్శకత్వం వహించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేసేవారు. తొలుత " దేవదాస్" సినిమా బాలీవుడ్ సినిమా "జానీ గద్దార్"కి రీమేక్ అనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరిగింది. అయితే ఈ చిత్రం ఏ ఇతర చిత్రానికి రీమేక్ కాదని.. ఇది పూర్తి కొత్త కథనంలో వస్తున్న చిత్రమని ఆ తర్వాత దర్శకుడే స్వయంగా వివరణ ఇవ్వడం జరిగింది. 

Trending News