నందమూరి హరికృష్ణ మృతికి సినీ ప్రముఖుల సంతాపం

రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందడం తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Last Updated : Aug 29, 2018, 02:47 PM IST
నందమూరి హరికృష్ణ మృతికి సినీ ప్రముఖుల సంతాపం

రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందడం తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

'చాలా రోజులైంది.. నిన్ను చూసి, కలవాలి తమ్ముడు.. కొన్ని వారాల క్రితం విన్న మాటలు ఇప్పుడు నీతోనే వెళ్లిపోయాయి. ఇది భ‌రించ‌లేని విషాదం. నేను నిన్ను మిస్ అయ్యాను అన్నయ్య' - నాగార్జున

'హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని అనుకొనేలోపే విషాద వార్త వినాల్సి వచ్చింది. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివి. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకెళ్లేందుకు భగవంతుడు శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నా'- పవన్ కళ్యాణ్  

'ఈ రోజు నా బ్రదర్‌ను కోల్పోయాను.. ఏం చెప్పాలో నాకు మాటలు రావడంలేదు అంటూ అత్యంత విలువైనదానిని కోల్పోయాను'- మోహన్ బాబు

'హరికృష్ణ గారు లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానూభూతిని తెలియజేస్తున్నాను. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'-  రామ్ చరణ్

 ‘హరికృష్ణ గారు హఠాన్మరణం చెందారన్న వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా సోదరుడు తారక్‌కు, అతని కుటుంబసభ్యులకు ఈ విషాదకర సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ - మహేష్ బాబు

 ‘నేను ఇండియాలో లేను. హరికృష్ణ గారి మరణవార్తను ఇప్పుడే విన్నా. షాక్‌కు గురయ్యా. నందమూరి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. సోదరులు కళ్యాణ్ రామ్, తారక్ లకు సానుభూతిని తెలుపుతున్నా. హరికృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి’ - అల్లు అర్జున్

'ఈ వార్త వినడం చాలా బాధ కలిగించింది. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్‌, కళ్యాణ్‌తో పాటు కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'- కాజల్‌

హరికృష్ణ మృతికి రానా దగ్గుభాటి, అల్లరి నరేష్‌, సుధీర్‌ బాబు, సాయిధరమ్‌ తేజ్‌, దేవీశ్రీ ప్రసాద్‌, మంచు లక్ష్మీ, అల్లు శిరీష్‌, మంచు మనోజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు సంతాపం తెలిపారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

 

 

 

 

 

 

Trending News