Central Govt Jobs Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. నెలకు రూ.81 వేల జీతం.. దరఖాస్తు నేడే లాస్ట్ ఛాన్స్!

Ministry of Home Affairs Recruitment 2023: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 797 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరి రోజు. ఆసక్తి గల వారు mha.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2023, 08:36 PM IST
Central Govt Jobs Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. నెలకు రూ.81 వేల జీతం.. దరఖాస్తు నేడే లాస్ట్ ఛాన్స్!

Ministry of Home Affairs Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, గ్రేడ్ 2 (టెక్నికల్) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద 797 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే నేడే ఆఖరి తేదీ. దరఖాస్తు ప్రక్రియ జూన్ 3 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ mha.gov.in ను సందర్శించండి.

ఎవరు అర్హులు..?

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు పరిమితి 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉండాలి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. బీఎస్‌సీలో ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ ఉన్నవారు లేదా గ్రాడ్యుయేషన్‌లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: Titanic Submarine: చివరికి విషాదాంతం.. టైటాన్ సబ్‌మెరైన్‌లో ఐదుగురు మృతి

జీతం ఎంత..?

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.30 వేల నుంచి 81 వేల వరకు జీతం ఉంటుంది. అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ ఇలా..

రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం కూడా అమలులో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాలకు మార్కులలో కోత విధిస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు దానికి సంబంధించిన నోటీసును చదవాలని అధికారులు సూచించారు. నేడు ఆఖరి తేదీ కావడంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Also Read: Underwater Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్‌లో అండర్ వాటర్ మెట్రో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News