ఈడు మగాడ్రా బుజ్జి.. 12 అడుగుల డేంజరస్ కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి! గూస్ బంప్స్ ఖాయం

Viral Video, Man caught King Cobra easily. ఇటీవల మురళీవాలే హౌస్లా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 17, 2022, 06:49 PM IST
  • ఈడు మగాడ్రా బుజ్జి
  • డేంజరస్ కింగ్ కోబ్రాను ఎలా పెట్టాడో చుడండి
  • వీడియో చూస్తే గూస్ బంప్స్ ఖాయం
ఈడు మగాడ్రా బుజ్జి.. 12 అడుగుల డేంజరస్ కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి! గూస్ బంప్స్ ఖాయం

Snake catcher Muraliwale Hausla caught King Cobra easily: ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా జంతువులకు సంబందించిన వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. సింహం, చిరుత, మొసలి, ఏనుగు, కుక్క, కోతి, పిల్లి, పాములకు సంబందించినవి నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ డేంజరస్ కింగ్ కోబ్రాను ఓ ట్రైనర్ అలవోకగా పట్టేశాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందిన మురళీవాలే హౌస్లా అనే వ్యక్తి పాములను పడుతుంటాడు. 2000 సంవత్సరం నుంచి అతడు పాములను కాపాడుతున్నాడు. కేవలం పాములనే కాదు మూగ జంతువుల ప్రాణాలను రక్షించడానికి ఎప్పుడూ ముందుంటాడు. ఈ క్రమంలోనే ఇళ్లలోకి వచ్చిన ఎన్నో పెద్ద పెద్ద పాములను పట్టుకుని అడవిలో వదిలేశాడు. తనకు సోషల్ వర్క్స్, హెల్పింగ్ చేయడం అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని 'మురళీవాలే హౌస్లా' యూట్యూబ్ ఛానెల్ ద్వారా మురళీవాలే స్వయంగా చెప్పాడు. 

ఇటీవల మురళీవాలే హౌస్లా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. ఓ పాత ఇంట్లో దూరిన 12 అడుగుల కింగ్ కోబ్రాను మురళీవాలే చాలా కష్టపడి పట్టుకున్నాడు. పాము రంద్రాలల్లో దూరినా వదలలేదు, కాటు వేయడానికి మీదికొచ్చినా బెదరలేదు. మురళీవాలే పామును నెమ్మదిగా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి.. దాన్ని పట్టుకునాడు. ఆపై ఓ సంచిలో వేసుకుని అడవిలో వదిలేశాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు వైరల్ అవుతొంది. ఈ వీడియోకి 23,194,727 వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన అందరూ 'ఈడు మగాడ్రా బుజ్జి' అని కామెంట్స్ చేస్తున్నారు. 

కింగ్ కోబ్రా ఒక విషపూరిత పాము జాతి. ఇది ఎక్కువగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. దీని సగటు పొడవు 10 నుండి 13 అడుగుల వరకు ఉంటుంది. 18 అడుగుల అతిపెద్ద కింగ్ కోబ్రా థాయ్‌లాండ్‌లో ఉంది. ఇలాంటి పాములను పెట్టుకోవడానికి ఎవరూ ప్రయత్నించొద్దు. ఎన్నో ఏళ్లు పాములు పట్టడంలో శిక్షణ ఉన్నవారే దీనిని పట్టుకుంటారు. 

Also Read: 2023-27 క్రికెట్ షెడ్యూల్‌ ప్రకటించిన ఐసీసీ.. నాలుగేళ్లలో 777 మ్యాచ్‌లు! భారత్ షెడ్యూల్‌ ఇదే

Also Read: Assam: రూ.500 కోసం రగడ..ఓ వ్యక్తి దారుణ హత్య..ఘటన ఎక్కడ జరిగిందంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News