Atharva Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న 'అథర్వ'.. అమెజాన్‌ ప్రైమ్‌లో ట్రెండింగ్

Atharva on Amazon Prime: క్లూస్ టీమ్‌ కోణంలో తెరకెక్కిన అథర్వ మూవీ థియేటర్లలో ఆడియన్స్‌ను మెప్పించి.. ఓటీటీలో దూసుకెళ్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉందని మేకర్స్ తెలిపారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2024, 06:36 PM IST
Atharva Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న 'అథర్వ'.. అమెజాన్‌ ప్రైమ్‌లో ట్రెండింగ్

Atharva on Amazon Prime: కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరిల కాంబోలో వచ్చిన థ్రిల్లర్ మూవీ అథర్వ. క్లూస్ టీం ఆధ్వర్యంలో ఎన్నో క్రైమ్ కేసులు పరిష్కారం అవుతాయి. కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా క్లూస్ టీం మీద సినిమా రాలేదు. నేరస్తుడిని పట్టుకునేందుకు వారు చేసే పరిశోధన మీద ఎప్పుడూ ఓ మూవీ రాలేదు. కానీ అథర్వ టీం ఆ కోణంలోనే వచ్చింది. యూనిక్ పాయింట్‌తో వచ్చిన అథర్వకు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి స్పందన వస్తోంది.

 Also Read: Wife Filed Case: పెళ్లయి రెండేళ్లయినా మా మధ్య 'ఏం' జరగలేదు..? భర్తపై కేసు వేసిన భార్య

అథర్వ సినిమాను మహేష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న వచ్చిన ఈ చిత్రం థియేటర్లో మంచి సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.

అథర్వ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. అయితే ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌‌లోకి వచ్చింది. ఇప్పటికీ ఈ చిత్రం టాప్‌ 10లో ట్రెండ్ అవుతోంది. అన్ని భాషల్లో ఈ మూవీ ట్రెండ్ అవుతున్న సందర్భంగా.. హిందీలోనూ డబ్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే హిందీ భాషలో కూడా అథర్వ అందుబాటులోకి రానుంది. ఓటీటీ ఆడియెన్స్‌ను అథర్వ ఆకట్టుకుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మేకర్స్ అంటున్నారు. ఇంకా అథర్వ సినిమా ట్రెండ్ అవుతుండటంతో ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు.

కథ ఏంటంటే..?

పోలీస్ అవ్వాలి.. కేసులను ఇన్వెస్టిగేట్ చేయాలనే డ్రీమ్స్‌లో ఉంటాడు దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు). అయితే దేవ్‌కు అస్తమా ఉండడంతో పోలీస్ సెలెక్షన్‌లో సెలక్ట్ కాలేకపోతాడు. కానీ పట్టుబట్టి క్లూస్‌ టీమ్‌లో జాయిన్ అయిన దేవ్.. తన తెలివితో దొంగతనాల కేసును క్షణాల్లో సాల్వ్ చేస్తాడు. కాలేజ్ మేట్ నిత్య (సిమ్రన్ చౌదరి) క్రైమ్ రిపోర్టర్‌గా మళ్లీ దేవ్ జీవితంలోకి వచ్చినా.. ఆమె ప్రేమను మాత్రం బయటకు చెప్పలేకపోతాడు.

నిత్యకు ఫ్రెండ్ అయిన జోష్ని (ఐరా) పెద్ద హీరోయిన్. ఆమె ఇంట్లోనే జోష్ని, ప్రియుడు శివ ఇద్దరు శవలై పడి ఉంటారు. ప్రేయసిని హత్య చేసి.. ప్రియుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఈ కేసును కొట్టేస్తారు. ఈ హత్యలకు సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకదు. అయితే నిత్యం మాత్రం ఈ విషయాన్ని నమ్మదు. దేవ్ కూడా ఈ కేసులో దోషులను కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతాడు. వాళ్లిద్దరిని ఎవరు చంపారు..? ఈ కేసులను నిత్య, దేవ్ ఎలా సాల్వ్ చేశారు..? అనేది అథర్వ మూవీలో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. 

 Also Read: Movie Chance Fraud: సినిమా ఛాన్స్‌ల పేరిట తన 'కోరికలు' తీర్చుకుని మోసం చేసిన నటుడు

 

అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News