Jio 5G Phone: జియో నుంచి 5జీ ఫోన్..ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..!

Jio 5G Phone: సామాన్యులకు జియో గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో మరో కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 15, 2022, 03:47 PM IST
  • సామాన్యులకు జియో గుడ్‌న్యూస్‌
  • త్వరలో మరో కొత్త ఫోన్‌
  • ఫోన్ తయారీ పనులు ముమ్మరం
Jio 5G Phone: జియో నుంచి 5జీ ఫోన్..ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..!

Jio 5G Phone: దేశ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు జియో మరో సరికొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. గతేడాది జియో ఫోన్‌ నెక్ట్స్‌ను వినియోగదారులకు ముందుకు తెచ్చింది. కేవలం రూ.5 వేలకే స్మార్ట్‌ఫోన్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. తాజాగా దానికి కొనసాగింపుగా 5జీ ఫోన్ తీసుకురానున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు మొదలైనట్లు తెలుస్తోంది. 

దసరా గానీ ఈఏడాది చివరి నాటికి జియో 5జీ ఫోన్‌ మార్కెట్‌లోకి రానుంది. ఈ విషయాన్ని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్‌లో జియో 5జీ ఫోన్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో..ధర ఎంత ఉంటుందన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

జియో 5జీ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ ఇస్‌ ప్లే ఉండనుందని సమాచారం. గూగూల్, జియో కలిపి అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్‌తోనే స్మార్ట్ ఫోన్‌ పనిచేయనుంది. స్నాప్‌డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని జియో వర్గాలు చెబుతున్నాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ ఎక్స్ 51 మోడెమ్‌ ఉండనుంది. జియో 5జీ ఫోన్‌ 5 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తాయని అంచనా వేస్తున్నారు. 

ఫోన్ వెనుక భాగంలో 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ కెమెరా ఉండనుంది. ముందుభాగంలో 8 ఎంపీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. జియో 5జీ ఫోన్‌ వెనుక గానీ సైడ్‌లో గానీ ప్రింగ్ సెన్సర్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆల్వేస్ ఆన్ గూగుల్ అసిస్టెండ్, గూగుల్ లెన్స్, ట్రాన్స్‌లేట్ లాంటి గూగుల్ యాప్స్ ఉండనున్నాయి. వీటితోపాటు మై జియో, జియో టీవీ ఉంటాయి. ఇతర జియో యాప్స్ సైతం అందుబాటులో ఉండనున్నాయని సమాచారం. 

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్‌కు సపోర్టుగా ఉండనుంది. 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుందని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డ్యూయల్ సిమ్, మెమొరీ కార్డు ఆప్షన్‌ ఉండనుందని తెలుస్తోంది. జియో 5జీ ఫోన్‌ను రూ.10 వేల నుంచి రూ.12 వేల మధ్య దొరికే అవకాశం ఉంది. జియో ఫోన్‌ నెక్ట్స్ తరహాలోనే వీటిని విక్రయించనున్నట్లు సమాచారం. కేవలం రూ.2 వేల 500 చెల్లించి 5జీ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈఎంఐ పద్ధతి నెలవారిగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

Also read:Jagan Govt: ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంటే! రేపటి నుంచే ఏపీ టీచర్లకు కొత్త సిస్టమ్..

Also read:Pawan Kalyan: ఒక్క అవకాశం ఇవ్వండి..అధికారంలోకి రాగానే అందరీ లెక్కలు తేలుస్తామన్న పవన్ కళ్యాణ్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News