తెలుగు సినీ పరిశ్రమలో 'క్యాస్టింగ్ కౌచ్‌'పై జీవిత సంచలన వ్యాఖ్యలు

సినీ పరిశ్రమలో మోసం జరగడం లేదు అని నేనెప్పుడు చెప్ప లేదు. కానీ మోసం జరగనిది ఎక్కడా అని నేను అడుగుతున్నాను. 

Last Updated : Apr 18, 2018, 10:11 AM IST
తెలుగు సినీ పరిశ్రమలో 'క్యాస్టింగ్ కౌచ్‌'పై జీవిత సంచలన వ్యాఖ్యలు

"సినీ పరిశ్రమలో మోసం జరగడం లేదు అని నేనెప్పుడు చెప్ప లేదు. కానీ మోసం జరగనిది ఎక్కడా అని నేను అడుగుతున్నాను. మోసం పలు రకాలు. ఫలానా చోట మోసం జరుగుతుందని తెలిసి కూడా నువ్వు అక్కడికి వెళ్తే అది మోసం కాదు. తెలియకుండా వెళ్లి నువ్వు బలవంతంగా వాళ్ల చేతిలో మోసపోతేనే అది మోసం. అలా మోసపోయానని ఫిర్యాదు చేసిన సందర్భాల్లో నిందితులని అరెస్ట్ చేసిన సందర్భాలు అనేకం వున్నాయి. మరి ఇప్పడు తెలుగు సినీ పరిశ్రమ మమ్మల్ని మోసం చేసింది అని మొరపెట్టుకుంటున్న వాళ్లంతా మోసపోయిన రోజే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని అన్నారు ప్రముఖ సినీ నటి, నిర్మాత జీవిత రాజశేఖర్. మోసపోయిన బాధితులంతా చిన్న వయస్సు వాళ్లు ఏం కాదు.. వాళ్లంతా 20, 30 ఏళ్ల వయస్సు వాళ్లే. అటువంటప్పుడు వాళ్లకు తెలియకుండానే వాళ్లు ఎలా మోసపోతారు ?" అని వ్యాఖ్యానించారు జీవిత. తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం కొత్తగా పరిశ్రమకు వచ్చే వారిని క్యాస్టింగ్ కోచ్ పేరిట వేధిస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ జీవిత ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ శ్రీ రెడ్డి, సంధ్య చేసిన ఆరోపణలపై జీవిత తన అభిప్రాయాలను వెల్లడించారు. 

మంచి చేసిన పరిశ్రమ గురించి నాకు తెలుసు కనుక నేను పరిశ్రమ గురించి మాట్లాడుతున్నాను. సామాజిక కార్యకర్త సంధ్య ఏం తెలుసునని తన గురించి, తన భర్త రాజశేఖర్ గురించి అలా తప్పుగా మాట్లాడింది అని ప్రశ్నించారు జీవిత. వారం రోజుల నుంచి చూసి చూసి కడుపు మండి ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నాను. ఒకరి పేరు ప్రస్తావించకుండా పరిశ్రమలో మోసం జరుగుతోంది అని ఆరోపిస్తున్నారు. కానీ పరిశ్రమ నుంచి మాత్రం ఏ ఒక్కరూ ముందుకొచ్చి స్పందించడం లేదు అని ఆవదన వ్యక్తంచేశారామె.

Trending News