ప్రభాస్ సాహో సినిమా గురించి.. చాలామందికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలివే

సాహో.. టాలీవుడ్ నటుడు ప్రభాస్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే చిత్రంగా ఇది పాపులర్ అవుతుందని ఇప్పటికే చాలామంది చలన చిత్ర విశ్లేషకులు అంటున్నారు. 

Last Updated : Oct 24, 2018, 09:03 AM IST
ప్రభాస్ సాహో సినిమా గురించి.. చాలామందికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలివే

సాహో.. టాలీవుడ్ నటుడు ప్రభాస్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే చిత్రంగా ఇది పాపులర్ అవుతుందని ఇప్పటికే చాలామంది చలన చిత్ర విశ్లేషకులు అంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కి బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడిందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సాహో సినిమాతో జాతీయ స్థాయిలో కూడా పేరొందిన నటుడిగా ఘనతకెక్కారు ప్రభాస్. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా సాహో చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..!

1. సాహో చిత్రంలో అనేక అండర్ వాటర్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా ప్రత్యేకంగా ప్రభాస్ స్కూబా డైవింగ్ కూడా నేర్చుకున్నారట.

2. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్ లాంటి తెలుగు నటులు ఇప్పటి వరకూ హిందీ చిత్రాల్లోనూ తమ లక్ పరీక్షించుకున్నారు. ప్రస్తుతం సాహో చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కుతోంది.. కాబట్టి ప్రభాస్ డైలాగ్ డెలివరీలో పరిణితిని పెంచుకోవడానికి ఓ ప్రొఫెషనల్ ట్యూటర్‌ని కూడా పెట్టుకున్నారు. 

3.సాహో చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వారిలో ప్రమోద్ ఉప్పలపాటి కూడా ఒకరు. ఆయన స్వయానా ప్రభాస్‌కి అన్నయ్య.

4.ఇప్పటికి భారతదేశంలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు మూడే మూడు. అందులో తొలిస్థానాన్ని రజనీకాంత్ నటిస్తున్న 2.0  చిత్రం (రూ.543 కోట్లు) అందుకోగా.. దాని తర్వాత స్థానంలో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ నటిస్తున్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ (రూ.300 కోట్లకు పైగా) చిత్రం చోటు దక్కించుకుంది. ఈ రెండు చిత్రాల తర్వాత మూడో స్థానంలో నిలిచిన చిత్రం సాహో మాత్రమే. తెలుగులో మాత్రం ఈ స్థాయి బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలి చిత్రం కూడా ఇదే. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాతి స్థానాల్లో బాహుబలి, పద్మావత్ చోటు దక్కించుకున్నాయి. 

5.‘మిషన్‌ ఇంపాజిబుల్‌: గోస్ట్‌ ప్రోటోకాల్, ట్రాన్స్‌ఫార్మర్స్‌: డార్క్‌ మూన్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసిన కెన్నీ బేట్స్‌ సాహో సినిమాకి యాక్షన్‌ సీన్స్‌ డిజైన్‌ చేయడం విశేషం.

6.ఈ సినిమాలో కేవలం యాక్షన్ ఎపిసోడ్లకే రూ.90 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నారు నిర్మాతలు.

7.సాహో సినిమాలో చాలా రిస్కీ స్టంట్స్ ఉన్నాయి. ఈ స్టంట్స్ చేయడంతో పాటు ప్రత్యేకమైన ఫిట్ నెస్ కూడా మెయిన్ టైన్ చేస్తున్నారు ప్రభాస్. ఆయనకు శిక్షణ ఇవ్వడానికి సుశిక్షితులైన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కూడా రెడీగా ఉన్నారు.

8. బుర్జ్ క‌ల్ఫియా, రాస్ అల్ కైమా, వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ లాంటి చరిత్రాత్మక ప్రదేశాల్లో ప్రభాస్ పై కొన్ని ఛేజింగ్ సీన్స్ తీశారు. అవి ఈ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు.

9.ఈ చిత్రంలో దాదాపు తొమ్మిది భాషలకు చెందిన నటులు నటిస్తున్నారు. అందులో ఇద్దరు విదేశీ భాషా నటులు కూడా ఉన్నారు. శ్రద్ధా కపూర్ (పంజాబీ), అరుణ్ విజయ్ (తమిళం), లాల్ (మలయాళం), స్రవంతి ఛటర్జీ (బెంగాలీ), వెన్నెల కిషోర్ (తెలుగు), మహేష్ మంజ్రేకర్ (మరాఠీ), జాకీ ష్రాఫ్ (గుజరాతీ), నటాషియా మాల్తే (నార్వే), ఈవ్లిన్ శర్మ (జర్మనీ) మొదలైనవారు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Trending News