Healthy Heart: గుండె శరీరంలో కీలకమైన భాగం. ఆ గుండె కొట్టుకున్నంతసేపే ప్రాణముంటుంది. బ్రేక్ లేకుండా కొట్టుకుంటూ ఉండాలంటే డైట్‌లో ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు రోగుల సఖ్య భారీగా పెరుగుతోంది. ఇండియాలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో ఆయిలీ ఫుడ్స్, అనారోగ్యకరమైన ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే కచ్చితంగా మీ డైట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేర్చాల్సిందే. అయితే ఏయే ఆహార పదార్ధాల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయో చూద్దాం..
డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్స్ చాలా మంచివి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు కాపర్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి. అయితే వాల్‌నట్స్ వేడి చేసే తత్వం కలిగి ఉంటుంది కాబట్టి వేసవిలో ఎక్కువగా తీసుకోకూడదు. వర్షాకాలం, చలికాలంలో మంచిది.
సోయాబీన్స్ కూడా ప్రోటీన్లకు ప్రధానమైన సోర్స్. ఇందులో ప్రోటీన్లతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. క్రమం తప్పకుండా సోయాబీన్స్ తీసుకుంటే..ఫోలెట్ మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాల లాభం చేకూరుతుంది.
ఇక మూడవది ఫ్లెక్స్‌సీడ్స్. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలకంగా ఉపయోగపడతాయి. దాంతోపాటు ఫ్లెక్స్‌సీడ్స్‌లో మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
ఇక మరో ముఖ్యమైన ఆహార పదార్ధం చేపలు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ముఖ్యంగా సాల్మన్ ఫిష్ చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ బి 5 గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇక ఆఖరిది గుడ్లు. గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు గుండె ఆరోగ్యానికి కావల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజూ క్రమం తప్పకుండా బ్రేక్‌పాస్ట్‌తో పాటు తీసుకుంటే చాలా మంచిది.
Also read: Diabetes: పసుపు, దాల్చిన చెక్కతో కూడా డయాబెటిస్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Healthy Heart: మీ గుండె పదికాలాలు ఆగకుండా ఉండాలంటే..ఈ ఐదు పదార్ధాలు తింటే చాలు