okra water benefits: పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో బెండకాయలు ఒకటి. బెండకాయ కూరను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ లేడీ ఫింగర్ లో ఎన్నో రకాల పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే బెండకాయ తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయో.. బెండకాయ నీరును తీసుకోవడం వల్ల అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిని ఓక్రా నీరు అని కూడా పిలుస్తారు. దీనిని ఎలా తాగాలి, దీని వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం.
బెండకాయ వాటర్ ను ఉదయాన్నే తాగడం వల్ల రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. లేడీ ఫింగర్ గింజలను 8-24 గంటలు నీటిలో నానబెట్టడం ద్వారా ఓక్రా నీటిని తయారుచేస్తారు. ఈ నీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పరిశోధనల్లో అద్భుతమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఓక్రా వాటర్ ఇతర ప్రయోజనాలు
బెండకాయలో ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్, ఫోలేట్, లినోలిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈనీటిని తీసుకోవడం వల్ల మన చాలా ఆరోగ్యంగా ఉంటాం. రక్తహీనత ఉన్నవారు దీనిని తీసుకోవడం మంచి లాభం ఉంటుంది. అంతేకాకుండా ఇది క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెరను తగ్గించడానికి ఓక్రా నీరు అద్భుతంగా పనిచేస్తుంది.
Also Read: Almond Benefits: బాదం.. ఆరోగ్యానికి వరం.. దీని ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.