Kinga Cobra Viral Video: స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన కింగ్ కోబ్రా... చివరకు ఏమైందంటే..!

Kinga Cobra Viral Video:  కింగ్ కోబ్రా పేరు వింటేనే మనలో చాలా మంది హడలిపోతారు. అలాంటి పాము కనిపిస్తే ఏమైనా ఉందా.. ఇక వెనక్కు తిరగకుండా పరుగెడతారు. అలాంటి ఓ కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2022, 01:56 PM IST
Kinga Cobra Viral Video: స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన కింగ్ కోబ్రా... చివరకు ఏమైందంటే..!

Kinga Cobra Viral Video: భూమి మీద అతి ప్రమాదకరమైన సర్పాల్లో కింగ్ కోబ్రా ఒకటి. దీనినే మనం నల్ల త్రాచు, రాచనాగు అని రకరకాల పేర్లుతో పిలుస్తాం. సాధారణంగా ఇది 18మీటర్లకుపైగా పొడవు ఉంటుంది. ఇది (Kinga Cobra) కాటు వేసిందంటే ఆ వ్యక్తి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ బతకడు. ఈ పాము తన పొడవులో మూడో వంతు వరకు పడగ ఎత్తగలదు. ఈ కింగ్ కోబ్రాలు భారత్, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఆగ్నేయ ఆసియా దేశాల్లోనే ఎక్కువవగా కనిపిస్తాయి. 

గుడ్లను పొదగడానికి గూడు కట్టే ఏకైక పాము ఇదే. కింగ్ కోబ్రా ఒక కాటుకు ఆసియన్ ఏనుగును చంపగలిగేంత విషాన్ని విడుదల చేస్తుంది. ఇది కాటు వేసిందంటే మనిషి మరణించే అవకాశం 75 శాతం వరకు ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లో ఉండటానికి ఇష్టపడతాయి. తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వీడియోపై మీరు ఓ లుక్కేయండి మరి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News