/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

ఫేస్బుక్ సంస్థ తమ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వారికి ఫేస్బుక్ సహాయంతో మొబైల్ రిఛార్జి చేసుకొనే సౌలభ్యాన్ని కూడా కల్పించింది. అయితే ఈ ఫీచర్ పొందాలంటే సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌ను అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం తొలుత యూజర్లు నేవిగేషన్ లింక్ కనిపించే దగ్గర ఉండే హాంబర్గర్ ఐకాన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత "See More" ఆప్షన్ పై క్లిక్ చేయండి. 

ఆ తర్వాత డ్రాప్ డౌన్ మెనూలో, Mobile Recharge అనే ఆప్షన్ కనిపిస్తుంది

 

ఆ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీకు Select Payment అనే ఆప్షన్ కనిపిస్తుంది

ఆ పేమెంట్ ఆప్షనులో మీరు కేవలం క్రెడిట్ లేదా డెబిట్ కార్డును మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ పే వాలెట్ లేదా యూపీఐ పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో లేవు

ఒకసారి పేమెంట్ ఆప్షను ఎంచుకున్నాక.. మీరు వేరొక పేజీకి రిడైరెక్ట్ చేయబడతారు

ఆ పేజీలో మీరు మీ మొబైల్ నెంబరుతో పాటు టెలికామ్ ఆపరేటరును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ రీఛార్జీ ప్లాన్స్ ఎంచుకొని.. పేమెంట్ చేయాల్సి ఉంటుంది

ఆ తర్వాత ఓటీపీ లేదా 3డీ పాస్ వర్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఫైనల్ పేమెంట్ అవుతుంది

పేమెంట్ పూర్తయ్యాక.. రిసీట్ కన్ఫర్మేషన్ వస్తుంది

ప్రస్తుతం ఫేస్బుక్ తర్వాత.. వాట్సాప్ కూడా కొత్త పేమెంట్ ఫీచర్స్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ పేమెంట్ ఫీచర్ ద్వారా వాట్సప్ మిత్రులకు డబ్బు పంపించవచ్చు. గూగుల్ సంస్థ కూడా ఇలాంటి పేమెంట్ ఫీచర్ తీసుకురావడానికి యోచిస్తుంది.

Section: 
English Title: 
Facebook now lets you recharge your phone on Android app: Here's how to do
News Source: 
Home Title: 

ఫేస్బుక్ ద్వారా  మొబైల్ రిఛార్జి చేయండిలా

ఫేస్బుక్ ద్వారా కూడా మొబైల్ రిఛార్జి చేసుకోవచ్చంట...!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఫేస్బుక్ ద్వారా కూడా మొబైల్ రిఛార్జి చేసుకోవచ్చంట...!