మెగాస్టార్ 152వ మూవీలో నటించే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి 151వ మూవీ సైరా షూటింగ్ ఇలా పూర్తయిందో లేదో 152 వ మూవీ ప్రాజెక్టు తెరపైకి వచ్చేసింది

Last Updated : Jun 27, 2019, 09:18 PM IST
మెగాస్టార్ 152వ మూవీలో నటించే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా ?

మెగాస్టార్ 151వ మూవీ సైరా మూవీ ఘూటింగ్ పూర్తి చేసుకోవడం ..ఇదే క్రమంలో రిలీజ్ కు సిద్ధమౌతున్న తరుణంలో ఇప్పటి నుంచే మెగాస్టార్ 152 మూవీ గురించి ఇప్పుటే టాక్ మొదలైంది. చిరు నెక్స్ట్ మూవీ కోసం డైరెక్టర్ గా కొరటాలను ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఇప్పటి నుంచే చిరు సరనన నటించే  ఛాన్స్ ఎవరికి దక్కతుందనే టాక్ మొదలైంది . కాగా హీరోయిన్ విషయంలో దిగ్గజ దర్శకుడు కొరటాల సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

సీన్ రిపీట్ అవుతుందా  ?

కొరటాల ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తో రిపీటెడ్ గా వర్క్ చేయలేదు. అంటే ఈవరసలో సమంతా నుండి బిగిన్ అయితే అనుష్క, కైరా అద్వానీ, శృతి హాసన్ లేనట్టేనా…? అంటే ప్రతిసారిలా కొరటాల ఇప్పటి వరకు తన సినిమాలో పని చేయని హీరోయిన్ నే ప్రిఫర్ చేస్తాడా..? లేకపోతే ఈసారి ట్రాక్ మార్చి రిపీట్ చేస్తాడా..?

కీర్తి సురేష్ కు ఛాన్స్ దక్కేనా ?

నిన్నా మొన్నటి వరకు ఈ వరసలో కీర్తి సురేష్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. కానీ ఎక్కడ కన్ఫర్మేషన్ రాలేదు. అంతలో ఈ సినిమా హీరోయిన్ స్పేస్ ఇంకా కన్సిడరేషన్ స్టేజ్ లోనే ఉందని ఇంకో టాక్ బయటికి వచ్చింది.

కొరటాల మదిలో ఏముంది ?

నిజానికి సైరా మూవీ షూటింగ్ జరుతున్నందన కొరటాల-చిరు కాంబినేషన్ వచ్చే మూవీ అంశం తెరపైకి రాలేదు . ఇప్పుడు సైరా  షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి.. రేపో మాపో ఈ సినిమా స్టార్ కాస్ట్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావచ్చని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే కొరటాల దృష్టిలో ఉన్న ఆ లక్కీ హీరోయిన్ ఎవరో..? తెలుసుకోవాలంటే మరికొన్న రోజుల పాటు వేచి చూడక తప్పదు మరి

Trending News