Dil Raju Comments: నీ ధైర్యం ఏంటి?.. స్టేజ్ మీదే నిర్మాతను ప్రశ్నించిన దిల్ రాజు

Dil Raju Comments on Rahul yadav Nakka: మాసూద నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీద దిల్ రాజు చేసిన బలుపు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 21, 2022, 08:43 PM IST
  • సూపర్ హిట్ గా మసూద
  • సక్సెస్ మీట్ నిర్వహించిన యూనిట్
  • యాంకర్ గా మారిన దిల్ రాజు
Dil Raju Comments: నీ ధైర్యం ఏంటి?.. స్టేజ్ మీదే నిర్మాతను ప్రశ్నించిన దిల్ రాజు

Dil Raju Comments on Rahul yadav Nakka Goes Viral in Social Media: చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అందుకుంది మసూద మూవీ. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సినిమాలు నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క తన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద మసూద సినిమాని తెరకెక్కించారు. ఒకప్పటి హీరోయిన్ సంగీత, నటుడు తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవీ శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్యప్రకాష్, సత్యం రాజేష్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ద్వారా సాయి కిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు..

ఈ సినిమా నవంబర్ 18 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా విడుదలైంది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకు వెళుతోంది. ఈ సినిమాకి రోజురోజుకీ కలెక్షన్స్ కూడా మంచిగా నమోదవుతున్నాయి. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ రామానాయుడు స్టూడియోస్ లో నిర్వహించింది. ఇక ఈ కార్యక్రమానికి దిల్ రాజు హాజరవ్వడమే గాక సదరు కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరించి ఆకట్టుకున్నారు.

సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ నటినటులు అందరినీ ఆయనే స్వయంగా ప్రశ్నలు అడిగి అనేక విశేషాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక ఈ సందర్భంగా దిల్ రాజు 50 సినిమాలు తీసి నిర్మాతగా అడుగుతున్న నాకు రెండు గంటల 45 నిమిషాల సినిమా చూపించావు. ఇది తగ్గించమంటే కుదరదని తెగేసి చెప్పావు అసలు నీ ధైర్యం ఏంటని అడిగితే నిర్మాత రాహుల్ మాట్లాడుతూ అలా ఏమీ లేదండి సినిమా విషయంలో చాలా హానెస్ట్ గా ఉండాలని ముందు నుంచి అనుకున్నానని అన్నారు.

కమర్షియల్ గా చేయడానికి స్క్రిప్ట్ పరంగా నాకు చాలా అవకాశాలు ఉన్నా స్క్రిప్ట్ విన్నాక అందులో సోల్ పోకూడదని అనుకున్నాను అందుకే ఎలాంటి కట్ చేయడానికి నేను ఇష్టపడలేదని చెప్పుకొచ్చారు. దీంతో దిల్ రాజు  వైవిధ్యంగా చేయడం వరకు ఒకే కానీ నిర్మాత కోణంలో కూడా సినిమాలు చేయాలి కదా పెట్టిన డబ్బులు రావాలి అంటే చాలా కష్టం కదా, ఆ డబ్బులు వస్తేనే కదా మరో సినిమా చేయగలిగేది నేనైతే 15 నిమిషాలు కట్ చేసే వాడిని కానీ నువ్వు మాత్రం అనుకున్నది అనుకున్నట్లు రిలీజ్ చేశావు అదే నీ బలుపు నీ గట్స్ అంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక దీంతో రాహుల్ ఇది జెన్యూన్ హారర్ డ్రామా అని అందుకే మూవీ లెంత్ గురించి ఏమీ ఆలోచించలేదని ఉన్నది ఉన్నట్టుగా స్క్రీన్ మీద చూపించాలని స్క్రిప్ట్ విన్న వెంటనే ఫిక్స్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: Manushi Chhillar: పెళ్లైన వ్యక్తి ప్రేమలో మానుషి.. కోటీశ్వరుడేనండోయ్, బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Also Read: Sneha Reddy Copies : అతన్ని నమ్మి మోసపోయిన అల్లు అర్జున్ భార్య.. నిండా మునిగిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News