బాలీవుడ్ టీవీ నటి, లాల్ ఇష్క్ ఫేమ్.. ప్రేక్ష మెహతా ఆత్మహత్య

లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధిని కోల్పోవడంతో బాలీవుడ్ టీవీ నటి ప్రేక్ష మెహతా మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు గురై ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని తన నివాసంలో

Last Updated : May 26, 2020, 10:14 PM IST
బాలీవుడ్ టీవీ నటి, లాల్ ఇష్క్ ఫేమ్..  ప్రేక్ష మెహతా ఆత్మహత్య

హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధిని కోల్పోవడంతో బాలీవుడ్ టీవీ నటి ప్రేక్ష మెహతా మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు గురై ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మంగళవారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. 

Also Read: Listen to her: మహిళలపై జరుగుతున్న గృహహింసపై లఘు చిత్రాన్ని నిర్మించిన నందితాదాస్..

ఇదిలాఉండగా చనిపోవడానికి ముందు ఇన్స్టాగ్రామ్ లో ఓ మెసేజ్ లో..  ఓ కలలు చనిపోయినప్పుడు జీవితం చెత్తగా ఉంటుందని మెసేజ్ పెట్టింది. కాగా ఈ ఉదయం ఫ్యాన్ కు వేలాడుతున్న ప్రేక్ష మెహతాను చూసి ఆమె తండ్రి షాక్ కు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రేక్ష మెహతా.. క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గ వంటి పలు టీవీ షోలతో పాటు... అక్షయ్ కుమార్ చిత్రం 'ప్యాడ్ మేన్'లో కూడా ఆమె నటించింది. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News