భారతీయన్స్ రివ్యూ & రేటింగ్..

దేశభక్తిపై వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల మెప్పును పొందినవే.. ఆ కోవాకి చెందిన సినిమానే భారతీయన్స్. భారతీయలు చైనాకి వెళ్లటం.. దేశం కోసం వారేం చేసారు అనేది కథ.. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2023, 02:46 PM IST
భారతీయన్స్ రివ్యూ & రేటింగ్..

భిన్నమైన కథలతో వచ్చే సినిమాలన్నీ ప్రేక్షకుల మన్నలను పొందాయి. ముఖ్యంగా దేశ భక్తి సినిమాలు అయితే చాలా అరుదుగా వచ్చిన్పప్పటికీ.. ఆడియన్స్ కూడా వాటిని ఆదరిస్తూనే ఉంటారు. మన దేశ సైనికులు ప్రాణ త్యాగాలు, శత్రు దేశస్థులు మన దేశంపై చేసే కుట్రలపై ఇప్పటీ వరకు చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి కథ కథనంతోనే వచ్చిన మరో సినిమా భారతీయన్స్. శంకర్ నాయుడు నిర్మించిన ఈ సినిమాని దీన రాజ్ తెరకెక్కించాడు. 

కథ: 
దేశభక్తి సినిమాలు అనగానే ఎక్కువగా పాకిస్థాన్ - భారత్ మధ్య జరుగుతున్న సంఘటనల గురించే ఉంటాయి. కానీ కొత్తగా ఈ సినిమాలో చైనా ఎత్తుగడల గురించి చూపించటం జరిగింది. ఈ సినిమాలో మాతో కొత్త విశేషం ఏంటంటే.. పాత్రలకు వారి పేర్లతో కాకుండా.. ప్రాంతాల పేర్లు పెట్టి పిలవటం.. కొంచెం కొత్తగా అనిపిస్తుంది. తెలుగు, నేపాలీ, త్రిపుర, పంజాబీ, భోజ్ పురి మరియు బెంగాలీ అనే ఆరుగురు ఒకే చోటుకు చేరటం.. వారికి ట్రైనింగ్ ఇచ్చి..  బోర్డర్ దాటించి చైనాలోకి పంపిస్తారు. అక్కడ ఉన్న ల్యాబ్ లో ఎం జరుగుతుంది..? ఈ ఆరుగురు ఎవరు..? ఎందుకు ఒకే చోటకి వచ్చారు..? ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు..? చైనా దేశం ఎత్తుగడ.. అక్కడి ల్యాబ్ లో ఏం జరిగింది..? అన్నదే సినిమా కథ.. 

ఎవరెలా చేసారంటే..?
ఈ సినిమాలో ఎక్కువ దేశ భక్తి చాటే భావోద్వేగపూరిత సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. తెలుగు, నేపాలీ, త్రిపుర, పంజాబీ, భోజ్ పురి మరియు బెంగాలీ అనే పేర్లతో చేసిన నటీనటులు చక్కగా నటించారు. బెంగాలీ, పంజాబీ, త్రిపుర పాత్రల్లో నటించిన అమ్మాయిలు అందంతో పాటు అభినయంతోను మెప్పించారు. సినిమాలోని ప్రతి యాక్షన్ మరియు ఎమోషన్ సీన్స్ లో మెప్పించారు. ఇక మిగతా పాత్రలో నటించిన వారు తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. 

విశ్లేషణ:
బోర్డర్ లో సైనికుల సమస్యలు.. వారు పడే కాష్టాలు.. ఉగ్రవాదుల కుట్రలు, పాకిస్థాన్, చైనా వంటి దేశభక్తి సినిమాలు తీయటం అంటే కత్తిమీద సాముతో  కూడుకున్న పనే అని చెప్పాలి. కానీ దర్శకుడు దేశభక్తి సినిమాలో ప్రేక్షకులని మమేకం చేయటంలో కొంత వరకు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి.

Also Read: Eluru Student Murder Case: గిరిజన విద్యార్థి హత్య కేసులో ట్విస్ట్.. ఆ ఇద్దరే నిందితులు..!  

సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. సిక్కిం ఏరియా, సరిహద్దు ప్రాంతాలను చక్కగా చూపించారు కెమెరామెన్. సంగీతం బాగుంది. ఆర్ఆర్‌తో కొన్ని సీన్స్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాత ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.

ఇక సినిమాల సాంకేతికతకు వస్తే.. బాగుంది అనే చెప్పాలి.. బోర్డర్ సీన్స్ సిక్కిం పరిసర ప్రాంతాల్లో చక్కగా చూపించారు. కెమెరామెన్. సంగీతం దర్శకుడి పనితనం బాగుంది. ఆర్ఆర్‌ ఆకట్టుకోగా.. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు గొప్పగా ఉండటంతో నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి కూడా తెరపై కనపడుతుంది. 
రేటింగ్ 2.75

Also Read: Realme C53 Price: మలేషియాలోని అమ్మకాల్లో సంచలనం సృష్టించిన Realme C53 మొబైల్‌ తర్వలో భారత మార్కెట్‌లోకి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News