Man Vs Wild: నేను దృఢంగా, శక్తి వంతంగా ఉండడానికి కారణాలు ఇవే: బియర్ గ్రిల్స్

Bear Grylls Diet: మ్యాన్ వర్సెస్ వైల్డ్(Man vs. Wild)టీవీ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన షోలలో ఒకటి. దాని హోస్ట్ బియర్ గ్రిల్స్ (Bear Grylls) అంటే అందరికీ అభిమానం. ఆయన చేసే ప్రతిది దైర్య సహాసమే. అయితే ఆయన షో  మ్యాన్ వర్సెస్ వైల్డ్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖులు భాగం కావడం విశేషం.

Last Updated : Jul 25, 2022, 12:41 PM IST
  • ఓ ఇంటర్వ్యూలో డైట్‌ ప్లాన్‌ వివరించిన..
  • మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో బియర్ గ్రిల్స్
  • నేను శాకాహారిని అని అన్నారు
 Man Vs Wild: నేను దృఢంగా, శక్తి వంతంగా ఉండడానికి కారణాలు ఇవే: బియర్ గ్రిల్స్

Bear Grylls Diet: మ్యాన్ వర్సెస్ వైల్డ్(Man vs. Wild)టీవీ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన షోలలో ఒకటి. దాని హోస్ట్ బియర్ గ్రిల్స్ (Bear Grylls) అంటే అందరికీ అభిమానం. ఆయన చేసే ప్రతిది దైర్య సహాసమే. అయితే ఆయన షో  మ్యాన్ వర్సెస్ వైల్డ్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖులు భాగం కావడం విశేషం. ఈ రోజూ మనం ఈ షో గురించి కాకుండా షో హోస్ట్ బేర్ గ్రిల్స్ (Bear Grylls) గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కేవలం ఆయన శాకాహారి అయినప్పడికీ.. షో కారణంగా మాంసాలను కూడా తినాల్సి వచ్చిందని వింత వ్యాఖ్యలు చేశారు. అయితే బిజినెస్ ఇన్‌సైడర్ షోలో ఆయన రోజూ తీసుతకునే ఆహారం గురించి వివరించారు. ముఖ్యంగా బియర్ గ్రిల్స్ డైట్‌ గురించి కూడా తెలిపారు.

ఆయన డైట్‌లో ఇవి ముఖ్యమైనవి:

బేర్ గ్రిల్స్ తన ఇంటర్వ్యూలో ఈ విధంగా వ్యాఖ్యానించారు..'ఆయన రోజూ తీసుకునే ఆహారంలో రెడ్ మీట్, పాల ఉత్పత్తులు, పండ్లను తీసుకుంటారని..  అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్, ధాన్యాలు, కూరగాయలు వంటివి తినడానికి ఎక్కువగా ఇష్టపడరని ఆయన తెలిపారు. మధ్యాహ్న భోజనంలో నాన్‌వెజ్‌, గుడ్లు, వెన్న, పండ్లు తింటారని చెప్పారు.  అంతేకాకుండా ప్రతిరోజూ జంతువుల కాలేయ మాంసాన్ని ఎక్కువగా తింటారని వివరించారు. అతను వారానికి ఒకటి లేదా రెండుసార్లు పిజ్జా లేదా వేయించిన గింజలను తింటాడని పేర్కొన్నారు. ఇక పచ్చి మాంసం విషయానికి వస్తే  మాంసాన్ని అస్సలు పచ్చిగా తినను అని చెప్పారు.

అడ్వెంచర్ ట్రిప్ నుంచి ఇంటికి రాగానే ముందుగా తినేది ఈ ఫుడ్డే:

బేర్ గ్రిల్స్ అడ్వెంచర్ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు.. అతనికి ఇష్టమైన బర్గర్లను తింటారని ఆయన తెలిపారు. తన బర్గర్‌లలో చీజ్, గుడ్లను కూడా కలుపి తయారు చేసుకుంటారని వివరించారు. అంతేకాకుండా ఈ ఆహారం తీసుకున్న తర్వాత బేర్ గ్రిల్స్.. ఒక చెంచా బోన్ మ్యారో, గ్రీక్ పెరుగు, తేనె, బెర్రీలను తింటారని తెలిపారు. ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ కూడా తాగుతారని పేర్కొన్నారు. అంతేకాకుండా రోజూ వ్యాయామం తప్పని సరిగా చేస్తారని ఇంటర్వ్యూలో చెప్పారు.

Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవ

Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News