Anasuya Bharadwaj : తాగుతారా? అంటూ నెటిజన్ ప్రశ్న.. చేతిలో ఒక్క షో లేకపోవడానికి కారణం చెప్పిన అనసూయ

Anchor Anasuya TV Shows తాజాగా అనసూయ తనకు ఆరోగ్యం బాగా లేదని, జలుబు అయిందని ఇంట్లోనే ఉందట. ఈ క్రమంలోనే నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2022, 06:30 PM IST
  • నెట్టింట్లో అనసూయ సందడి
  • టీవీకి కాస్త బ్రేక్ ఇచ్చానన్న అనసూయ
  • వైన్ తాగుతానన్న యాంకర్ అనసూయ
Anasuya Bharadwaj : తాగుతారా? అంటూ నెటిజన్ ప్రశ్న.. చేతిలో ఒక్క షో లేకపోవడానికి కారణం చెప్పిన అనసూయ

Anchor Anasuya TV Shows : యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయి స్టార్ మాలో సింగింగ్ షోకు హోస్ట్‌గా మారింది. అనసూయ, సుధీర్ ఒకేసారి వెళ్లి స్టార్ మా షోకు హోస్ట్‌గా చేశారు. ఇప్పుడు ఆ షో అయిపోయింది. అనసూయ ఖాళీగా ఉండాల్సి వచ్చింది.అయితే ఇప్పుడు ఏ షో చేయడం లేదా? అని నెటిజన్లు ప్రశ్నించడంతో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. అనసూయ ప్రస్తుతం జలుబు చేసి ఇంట్లోనే కూర్చుందట.

దీంతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ పెట్టేసింది. ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వెళ్లింది. ప్రస్తుతం మీరు చేస్తున్న షో ఏంటి? అని అనసూయను ఓ నెటిజన్ అడిగాడు. టీవీ?.. టీవీకి మనం కొంచెం బ్రేక్ ఇచ్చాం కదా?.. ఏదన్నా ఎగ్జైటింగ్.. నా స్థాయికి తగ్గ షో అనిపించేంత వరకు ఇంతే అని చెప్పుకొచ్చింది.

ఇక మరో నెటిజన్ ఇలా అడిగేశాడు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ ఏంటి? అని అన్నాడు. రంగమార్తాండ, హరిహర వీరమల్లు, చేజ్, ఫ్లాష్‌ బ్యాక్, ఇంకో తమిళ సినిమా, షూటింగ్ అయింది.. డబ్బింగ్ కావాల్సి ఉంది.. మైఖేల్, సింబా, అరి అనే సినిమాలున్నాయి. ఇంకో తెలుగు సినిమా ఉంది.. కానీ ఇప్పుడే వాటి డీటేల్స్ చెప్పలేను.. పుష్ప పార్ట్ 2 సెట్‌లోకి త్వరలోనే అడుగుపెట్టబోతోన్నాను.. ఈ నెలలో ఇంకో రెండు చిత్రాలు స్టార్ట్ చేస్తాను.. మలయాళంలో ఇంకో సినిమాను స్టార్ట్ చేయబోతోన్నాను అని అనసూయ చెప్పుకొచ్చింది.

జబర్దస్త్ రోజులను మిస్ అవుతున్నారా? అని మరో నెటిజన్ అడిగాడు. అవును మిస్ అవుతుంటాను.. నా జీవితంలో జబర్దస్త్ షోకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. కానీ కొన్ని సార్లు మనకు చెందని చోట మనం ఉండాల్సి వస్తుంది.. అలాంటి పరిస్థితులు వస్తుంటాయి.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అనసూయ చెప్పుకొచ్చింది. మరో నెటిజన్ వైన్ గురించి అడిగితే.. తాను వైన్ తాగుతాను అని చెప్పింది.

Also Read : Bigg Boss Shiva Jyothi : కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన శివ జ్యోతి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి

Also Read : Vanangaan Movie : ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సూర్య.. ఎక్కడ తేడా కొట్టిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News