చాలా గ్యాప్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సెట్స్ పైకి కనిపించాడు. సరిగ్గా ఏడాది గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్ లో బన్నీ చేస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ వేదికగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేసిన చిత్ర యూనిట్... ఇకపై ఏకథాటిగా షూటింగ్ కొనసాగించాలని డిసైడ్ అయ్యారు
హీరోయిన్ గా పూజా హెగ్డే ...
సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించేందుకు పూజా హెగ్డేను ఎంపిక చేశారు. త్వరలోనే ఆమె షూట్ లో జాయిన్ అవుతుంది. మరో కీలకపాత్ర కోసం ఒకప్పటి హీరోయిన్ టబును తీసుకున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో సత్యరాజ్, జయరాం కనిపించనున్నారు.
టైటిల్ కోసం కసరత్తు..
హారిక-హాసిని, గీతాఆర్ట్స్ బ్యానర్లపై రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ ఇప్పటికే ఈ సినిమాకు పాటలిచ్చే పని స్టార్ట్ చేశాడు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రెడీ చేయాలని చూస్తున్నారు. సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు.