నటి శ్రియ పెళ్లి వార్తలు గత కొన్ని రోజుల నుంచి హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందని..తన బాయ్ ఫ్రెండ్ రష్యన్ అని కథనాలు ప్రసారమయ్యాయి. ఇక ఈ సన్పెన్స్ కు తెరదించుతూ శ్రియ పెళ్లి వీడియో విడుదలైంది. కాగా ప్రియుడు రష్యన్ అయినప్పటికీ ఆమె తన పెళ్లి హిందూ సాంప్రదాయ ప్రకారం చేసుకోవడం విశేషం. పెళ్లి వీడియోలో శ్రియ ఎరుపు రంగు లెహంగా, జువెలరీలో తెగ మెరిసిపోతోంది. పెళ్ళి సమయంలో తన ప్రియుడిని తన భర్తకు శ్రియ ఓ కిస్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియా చూసి మీరు ఎంజాయ్ చేయండి.
Here's the Beautiful video of #AndreiKoscheev promise for her love life @shriya1109 #ShriyaSaran #Shriya #ShriyaWedding #ShriyaMarriage @rameshlaus @LMKMovieManiac @sridevisreedhar @MoviesUpdatez @Sekhartweets @HydTimes @sri50 @SurendharMK @diamondbabu4 @onlynikil @crhemanth pic.twitter.com/hpW89OteB9
— Shriya Saran Fans 💟 (@ShriyaSaran_F) March 19, 2018
శ్రియ భర్త కొశ్చీవ్ మాట్లాడుతూ 'ఒక వ్యక్తి ప్రేమిస్తున్నారంటే... అది కేవలం వ్యక్తిత్వాన్ని చూసే. తన ప్రేమ కోసం కొంచెం మారలేవా అని ఎవరైనా అడిగితే.. అది నిజమైన ప్రేమ కాదు. అది రాజీ పడటమే. కానీ ఈ విషయంలో తను, శ్రియ రాజీపడం' అని చెప్పాడు. వెంటనే శ్రియ కల్పించుకుని...అంటే దాని అర్థం నా పిచ్చితనాన్ని నీవు అంగీకరించినట్టేనా అని భర్త కొశ్చీవ్ క్వశ్చన్ చేసింది ఈ ముద్దుగుమ్మ . దానికి కొశ్చీవ్ 'యస్' అంటూ సమాధానం ఇచ్చాడు.