ముంబై: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నేటి ఉదయం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి డాక్టర్లు పోస్ట్‌మార్టమ్ (Sushant Singh Rajput Postmortem Report) పూర్తి చేశారు. డా.ఆర్ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్ డాక్టర్లు పోస్టుమార్గం ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. సుశాంత్ మరణం ఆత్మహత్యేనని నిర్ధారించారు. ఉరివేసుకోవడం వల్ల ఊపిరాడక ఆయన చనిపోయినట్లు తెలిపారు. సుశాంత్‌ను ప్రశాంతంగా వెళ్లనివ్వండి : Sonu Sood రిక్వెస్ట్
ఏదైనా విషపూరిత ద్రావణాలు, ట్యాబ్లెట్లు ఏమైనా తీసుకున్నారా అనేది తెలుసుకునేందుకు కొన్ని శాంపిల్స్ జేజే ఆసుపత్రికి పంపించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకున్నాడు. డిప్రెషన్‌కు సంబంధించిన మెడిసిన్ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, నేడు సుశాంత్ అంత్యక్రియలు (Sushant Singh Lajput Last Rites) జరగనున్నాయి. పాట్నా నుంచి సుశాంత్ కుటుంబసభ్యులు నేటి ఉదయం ముంబైకి బయలుదేరారు. బుల్లితెరపై రాణించి వెండితెరకు పరిచయమైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తీసిన ‘ఎం.ఎస్. ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ’తో బాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు. కానీ అంతలోనే డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ
‘సుశాంత్ నుంచి ఇలాంటి ఫినిష్ ఊహించలేదు’