ప్రముఖ కమెడియన్‌కి 6 నెలల జైలుశిక్ష..!

బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్టనర్, భూల్ భుల్లయ్యా, హంగామా లాంటి హిందీ చిత్రాలతో బాగా పాపులరైన రాజ్‌పాల్ యాదవ్ రవితేజ నటించిన "కిక్ 2" అనే తెలుగు చిత్రంలో కూడా నటించారు.

Last Updated : Apr 23, 2018, 11:22 PM IST
ప్రముఖ కమెడియన్‌కి 6 నెలల జైలుశిక్ష..!

బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్టనర్, భూల్ భుల్లయ్యా, హంగామా లాంటి హిందీ చిత్రాలతో బాగా పాపులరైన రాజ్‌పాల్ యాదవ్ రవితేజ నటించిన "కిక్ 2" అనే తెలుగు చిత్రంలో కూడా నటించారు. అలాగే పలు సినిమాలలో హీరోగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన "లేడీస్ టైలర్" హిందీ రీమేక్‌లో రాజ్‌పాల్ యాదవ్ హీరోగా కూడా నటించారు.

వివరాల్లోకి వెళితే... రాజ్‌పాల్ 2010లో "అటా పాటా లాపాటా"అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా కోసం ఫైనాన్షియర్ ఎంజీ అగర్వాల్ వద్ద కొంత డబ్బు అప్పు తీసుకొన్నారు. అయితే రాజ్‌పాల్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వడంతో.. ఫైనాన్షియర్ కేసు వేశారు. ఈ కేసు విషయంలో భాగంగా రాజ్‌పాల్‌ను పోలీసులు 10 రోజులు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. 

తాజాగా ఈ కేసులో కకర్‌దుమా జిల్లా కోర్టు తీర్పు ఇస్తూ.. చెల్లని చెక్కులు ఇచ్చిన కారణంగా రాజ్‌పాల్‌కు ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అయితే రాజ్‌పాల్ తనకు అప్పు తీర్చడానికి 30 రోజులు గడువు ఇవ్వమని న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికే అగర్వాల్‌కి రూ.1.58 కోట్లు చెల్లించానని.. ఇంకా రూ.3.42 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు.

ఈ అప్పులు తీర్చడానికి ఓ కంపెనీ ముందుకు వచ్చిందని.. అందుకే కొంత గడువు అడుగుతున్నానని రాజ్‌పాల్ కోర్టుకి విన్నవించుకున్నారు. ప్రస్తుతం రాజ్‌పాల్ "టోటల్ ధమాల్" అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. 1999లో "దిల్ క్యా కరే" అనే హిందీ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన రాజ్‌పాల్ పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. తాజా కేసులో రాజ్‌పాల్‌తో పాటు ఆయన భార్యపై కూడా కోర్టులో ఆరోపణలు ఉన్నాయి

 

Trending News