Zee Saregamapa: జీ సరిగమప విజేతని కనిపెట్టండి..బహుమతి పట్టండి.. పోటీలో పాల్గొనండి ఇలా!

Zee Saregamapa The Singing Superstar Telugu Finale: 'జీ తెలుగు' ఛానల్లో ప్రసారమవుతున్న 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' ఫినాలే దగ్గరకు వచ్చేసింది. ఇక ఈ క్రమంలో జీ తెలుగు మీకు ఒక కాంటెస్ట్ సిద్దం చేసింది. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2022, 06:28 AM IST
  • జీ సరిగమప విజేతని కనిపెట్టండి..
  • బహుమతి పట్టండి..
  • పోటీలో పాల్గొనండి ఇలా
Zee Saregamapa: జీ సరిగమప విజేతని కనిపెట్టండి..బహుమతి పట్టండి.. పోటీలో పాల్గొనండి ఇలా!

Zee Saregamapa The Singing Superstar Telugu Finale:  'జీ తెలుగు' ఛానల్లో ప్రసారమవుతున్న 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఎన్నో ఊహించని మధురానుభావాలను పంచుతూ ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ఈ షో ప్రతి ఆదివారం ఎన్నో అద్భుతమైన గాత్రాలను అంతకన్నా అద్భుతమైన వ్యక్తిత్వాలను మీ ముందుకు తీసుకు వచ్చింది. అయితే ఈ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఇరవై నాలుగు మందిలో ఎట్టకేలకు ఎనిమిది మంది ఫైనల్స్ కు వెళ్లారు.

అభినవ్, డానియెల్, సాయిశ్రీ చరణ్, సుధాన్షు, శివాని, శృతిక సముద్రాల, దాసరి పార్వతి సహా ప్రణవ్ కౌశిక్ ఆగష్టు 14న (ఆదివారం) ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఫినాలే ఎపిసోడ్ లో సరిగమప – ది సింగింగ్ సూపర్ స్టార్ టైటిల్ కోసం పలు రౌండ్లలో పోటీపడుతున్నారు. ఫైనల్ కి చేరుకున్న ఎనిమిది సింగర్స్ అద్భుతమైన గాత్రంతో పాటు, ఈ ఫినాలే ఎపిసోడ్ మరెన్నో అద్భుతమైన సర్ప్రైజ్ లు వీక్షకుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక ఈ ఫినాలే ఎపిసోడ్ లో ప్రముఖ గాయని పీ.సుశీల, మాచర్ల నియోజకవర్గం స్టార్స్ నితిన్, క్రితి శెట్టి, అలాగే శృతి హాసన్ కూడా ఈ ఫినాలేకి అతిధులుగా రానున్నారు.

ఇక సంగీత ప్రపంచానికి  పీ.సుశీల చేసిన సేవలు పురస్కరించుకుని 'జీ తెలుగు' ఆయెను ఘనంగా సన్మానించనుంది. ఇక శృతి హాసన్, నితిన్ అలాగే క్రితి శెట్టి డ్యాన్స్ తో సందడి చేయనున్నారు. ఇక జీ 5లో ప్రసారం కానున్న 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, యూట్యూబర్స్ మరియు నటులు అనిల్ జీల, నిఖిల్ విజయేంద్ర సింహ తదితరులు కూడా ఈ ఫినాలేలో సందడి చేయనున్నారు. ఇక ఈ 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' టైటిల్ ఎనిమిది మందిలో ఎవరు చేజిక్కించుకుంటారనేది తెలియాలంటే ఈ ఆదివారం జరిగే ఫినాలే మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

అన్నట్టు సరిగమప వీక్షకులకు జీ తెలుగు 'విన్ విత్ ది విన్నర్' అనే కాంటెస్ట్ కూడా ప్లాన్ చేసింది. అదేమంటే ఈ షో విన్నర్ ను కరెక్ట్ గా గెస్ చేసిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు. ఇక ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలంటే, జీ తెలుగు ఛానల్, జీ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో  చూపిస్తున్న 'QR' కోడ్ ని స్కాన్ చేసి విన్నర్ ఎవరో గెస్ చేయాల్సింది ఉంటుంది. అలా కరెక్ట్ గా గెస్ చేసిన వారి పేర్లను ఒక లక్కీడ్రా నిర్వహించి విజేతను ఆగష్టు 14న ప్రకటించి, బహుమతి కూడా అందజేయనున్నారు. కానీ ఈ కాంటెస్ట్ ఆగష్టు 13న ముగియనుంది, త్వరపడండి మరి.

Also Read: Raju Srivastava: జిమ్‌లో గుండె పోటుతో కుప్పకూలిన మరో నటుడు..!

Also Read: Rana Daggubati: రానా ఇంస్టాగ్రామ్‌లో పోస్టులన్నీ డిలీట్ చేయడానికి కారణాలు ఇవేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News