Heros Sudarshana Yagam: వరుస ఫ్లాపులతో డుంకీలు కొడుతున్న హీరో.. దేవుడే దిక్కంటున్న తండ్రి!

Heros Father Does a Sudarshana Yagam : వరుస ప్లాప్ సినిమాలతో అనేక ఇబ్బందులపాలు అవుతున్న తన కుమారుడిని ఎలా అయినా ఒక దారిలో పెట్టాలనే ఉద్దేశంతో టాలీవుడ్ కుర్రహీరో తండ్రి తానా కొడుకుతో సుదర్శన యాగం చేయించాడని అంటున్నారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 15, 2022, 06:00 PM IST
Heros Sudarshana Yagam: వరుస ఫ్లాపులతో డుంకీలు కొడుతున్న హీరో.. దేవుడే దిక్కంటున్న తండ్రి!

Young Heros Father Does a Sudarshana Yagam for His Son: తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అందరి హీరోలు సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది మంచి ముహూర్త బాలాలను చూసుకుని సినిమాలు ప్రారంభిస్తే మరి కొంతమంది అడుగు బయట పెట్టాలన్న అనేక సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు తాను ఎంత కష్టపడుతున్నా హీరోగా నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఒక కుర్ర హీరో దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి ఆయనకు నటుడిగా మంచి టాలెంట్ ఉంది కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి, సినిమాలు చేస్తున్నాడు, రిలీజ్ అవుతున్నాయి కానీ సినిమాలు ప్రేక్షకులను మాత్రం ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఆయన హీరోగా నటించిన చివరి సినిమా కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడింది. ఆ సినిమా ధియేటర్లలో పెద్దగా ఆడక పోవడంతో ఆ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ అలాగే శాటిలైట్ రేట్స్ కూడా అమ్ముడు పోలేదని అంటున్నారు.

అయితే ఇప్పుడు సదరు హీరో తండ్రి ఆయన హీరోగా తర్వాత ప్రాజెక్టులో కూడా డబ్బులు పెట్టడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సదరు హీరో ట్రాక్ రికార్డు చూసి ఆయన తండ్రి కూడా బిత్తర పోతున్నాడట. ఇలా అయితే మా వాడి పరిస్థితి కష్టమేనని భావించిన ఆయన దేవుడినే నమ్ముకోమని కుమారుడికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక కుమారుడితో కలిసి సుదర్శన యాగం చేయించడానికి సదరు తండ్రి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

అలా చేస్తే దైవానుగ్రహం లభిస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నాడట.  అందుకే ఈ మధ్యనే సుదర్శన యాగం కూడా ఘనంగా జరిపించారని, ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా ఈ యాగం జరిపించారని తెలుస్తోంది. యాగం విజయవంతంగా పూర్తి కావడంతో సదరు హీరో అలాగే ఆయన తండ్రి కూడా ఇక మీదట అన్ని విషయాలు బాగుంటాయని భావిస్తున్నారట.

జాతక ప్రకారం కూడా 2023 నుంచి సదరు హీరోకి అంతా బాగానే ఉండడంతో ఇకమీదట చేసే సినిమాలన్నీ హిట్ అవుతాయని వారు భావిస్తున్నారట. ఇక ఇప్పటివరకు అయిందేదో అయింది వచ్చే సినిమాల విషయంలో అయినా జాగ్రత్తగా ఉండాలని వీరిద్దరూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ యాగం ఈ తండ్రీ కొడుకుల జాతకాలను ఎంతవరకు మార్చేస్తుంది అనేది చూడాల్సి ఉంది.

Also Read: Kalpika Ganesh: నన్ను కెలుకుతున్నావ్ ధన్య, నీ పవర్ చూపించావ్ గా నా పవర్ చూపిస్తే మాడిపోతావ్!

Also Read: Nandamuri Balakrishna: బాలకృష్ణపై భూ ఆక్రమణ కేసు పెట్టాలి.. మరీ ఇంత నిర్లక్ష్యమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News