Chiranjeevi: పుట్టినరోజు, పెళ్లిరోజు కంటే ఈరోజే ప్రత్యేకం. ఎందుకో తెలుసా..

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికున్న స్థానం అత్యంత ప్రత్యేకమైంది. నటుడిగా 42 ఏళ్ల ప్రస్థానంలో ఏన్నో మైళ్లు రాళ్లు అధిగమించిన చిరు..తనకు ఇవాళ్టి రోజు చాలా ప్రత్యేకమంటున్నారు. కారణమేంటంటే.

Last Updated : Sep 22, 2020, 01:27 PM IST
Chiranjeevi: పుట్టినరోజు, పెళ్లిరోజు కంటే ఈరోజే ప్రత్యేకం. ఎందుకో తెలుసా..

తెలుగు చిత్ర పరిశ్రమ ( Telugu Film Industry ) లో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) కున్న స్థానం అత్యంత ప్రత్యేకమైంది. నటుడిగా 42 ఏళ్ల ప్రస్థానంలో ఏన్నో మైళ్లు రాళ్లు అధిగమించిన చిరు..తనకు ఇవాళ్టి రోజు చాలా ప్రత్యేకమంటున్నారు. కారణమేంటంటే..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తరువాతి తరంలో ప్రముఖ నటుడు ఇప్పటికీ ఇండస్ట్రీని శాసించే నటుడిగా మెగాస్టార్ చిరంజీవికు అత్యంత ప్రాధాన్యత ఉంది. కొణిదెల  శివ శంకర వరప్రసాద్ ఇండస్ట్రీలో ప్రవేశించి 42 ఏళ్లవుతోంది ( 42 years ). ఇవాళ మెగాస్టార్  పుట్టినరోజు కాదు. పెళ్లిరోజు కాదు..కుమారుడి పుట్టినరోజు అంతకంటే కాదు. అయినా ఇవాళ్టి రోజు తనకు అత్యంత ప్రాధాన్యత కలిగినదంటూ ట్విట్టర్ వేదికపై షేర్ చేశారు. ఆ కారణం ఇదే.

1955 ఆగ‌స్టు 22న కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ (చిరంజీవి) పుట్టిన‌రోజు అయితే..1978 సెప్టెంబ‌ర్ 22 మాత్రం న‌టుడిగా ( 1978 September 22nd ), చిరంజీవిగా ప‌రిచ‌య‌మైన రోజు. మెగాస్టార్ గా అభిమానుల నీరాజ‌నాలు అందుకున్న చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖ‌రీదు విడుద‌లై నేటికి 42 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నాటి మ‌ధుర‌ క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్నారు చిరంజీవి. 

'నా జీవితంలో ఆగ‌స్టు 22కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో..సెప్టెంబ‌ర్ 22కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఆగ‌స్టు 22 నేను మ‌నిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే..సెప్టెంబ‌ర్ 22 న‌టుడిగా  'ప్రాణం (ఖరీదు) ' పోసుకున్న రోజు. నా మొద‌టి సినిమా విడుద‌లైన రోజు. నన్ను ఇంత‌గా ఆద‌రించి నన్ను ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్ష‌కులంద‌రికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణ‌మైన అభిమానులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని అని మెగాస్టార్ చిరు ట్వీట్ చేశారు.  Also read: Mahesh Babu: నా అసలైన సంతోషం నువ్వే: నమ్రతా శిరోద్కర్

Trending News