Sunny Bigg Boss telugu Winner : బిగ్‌బాస్‌ తెలుగు 5 సీజన్‌ విజేత సన్నీ? ఓటింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌..

Bigg Boss Telugu5 Winner : బిగ్‌బాస్‌ తెలుగు 5 సీజన్‌ ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవవచ్చని మొన్నటి వరకూ అందరూ అనుకున్నారు. ఇప్పుడు పక్కా విజేత ఎవరో కూడా తెలిసిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 03:18 PM IST
  • ఫైనల్ స్టేజ్‌కు బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌
  • ఈ సీజన్ విజేత ఎవరు అనే అంశంపైనే చర్చ
  • విజేత ఎవరో తెలిసిపోయింది...
  • ఓటింగ్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లో వీజే సన్నీ
Sunny Bigg Boss telugu Winner : బిగ్‌బాస్‌ తెలుగు 5 సీజన్‌ విజేత సన్నీ? ఓటింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌..

VJ Sunny as Winner Of Bigg Boss Telugu 5 season? : బిగ్‌బాస్‌ తెలుగు 5 సీజన్‌ ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా ఈ సీజన్ విజేత ఎవరు అనే అంశంపైనే చర్చ సాగుతోంది. సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవవచ్చని మొన్నటి వరకూ అందరూ అనుకున్నారు. ఇప్పుడు పక్కా విజేత ఎవరో కూడా తెలిసిపోయింది. ముఖ్యంగా పోటీ సన్నీ, షణ్ను మధ్యే ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇందులో సన్నీ..బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ విజేత అని దాదాపు ఖరారు అయిపోయింది. లాస్ట్ మూమెంట్‌లో ఏదైనా ట్విస్ట్‌లు ఉంటే చెప్పలేం కానీ.. లేదంటే పక్కా.. వీజే సన్నీ బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ విన్నర్. (VJ Sunny Big Boss Telugu 5th Season Winner)

ఫైనల్ స్టేజ్‌లో ఏయే కంటెస్టెంట్‌కు ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.. ఓటింగ్‌లో 34 శాతం ఓట్లతో సన్నీ ఫస్ట్‌ ప్లేస్‌లో (Sunny First Place) ఉన్నట్లు సమాచారం. తర్వాతి స్థానాల్లో షన్ముఖ్ 31(Shanmukh) శాతంలో ఓట్లతో రెండో స్థానంలో, శ్రీరామచంద్ర (Sri Ramachandra) 20శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారని టాక్. మానస్‌కు 8శాతం, సిరికి 7శాతం ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. దీని బట్టి ఈ సీజన్ విన్నర్ సన్నీ అని క్లియర్‌‌గా తెలుస్తోంది. త్వరలోనే ఈ రియాల్టీ షో ముగియ‌నుంది. అధికారికంగా ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవరో కూడా తెలియనుంది. 

Also Read : Hyderabad: సినిమా ప్రదర్శన 15ని. ఆలస్యం-ఆ మల్టీప్లెక్స్‌కు రూ.1లక్ష జరిమానా

సెప్టెంబ‌ర్ 5న ప్రారంభ‌మైన బిగ్ బాస్ షో (Bigg Boss Show).. త్వరలో ముగియనుంది. ఈ కార్య‌క్ర‌మం కోసం 19 మంది బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌గా ప్ర‌స్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారు. మానస్, సిరి, ష‌ణ్ముఖ్‌, శ్రీరామ్, స‌న్నీ ప్రస్తుతం హౌజ్‌లో ఉన్నారు. 

ఇక స‌న్నీ.. ఎలా అయిన క‌ప్ తీసుకెళ్తానని ధీమా కూడా వ్య‌క్తం చేశారు. తాజా ఎపిసోడ్‌లో (latest episode) మాన‌స్, స‌న్నీకి మధ్య జరిగిన డిస్కషన్‌లో.. తాను ఎలాగైనా టైటిల్‌ గెలవాలి అని సన్నీ పేర్కొన్నారు. మా అమ్మకు కప్‌ ఇస్తరా బయ్‌ అంటూ సన్నీ అన్నారు. బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చిన నటరాజ్‌ మాస్టర్‌‌ కూడా సన్నీ విన్‌ (Sunny Win) అవ్వాలని ఉందంటూ తన మనసులోని మాట చెప్పారు.

 

Also Read : BJP MP Slapping Wrestler: స్టేజిపై రెజ్లర్ చెంప పగులగొట్టిన ఎంపీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News