Spark Life Review : మైండ్ కంట్రోల్ సైంటిఫిక్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..

Spark Life rating: కొద్దిరోజుల గ్యాప్ తర్వాత హీరోయిన్ మెహరీన్ మన ముందుకి ‘స్పార్క్ లైఫ్’ అనే సినిమాతో వచ్చేసింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విక్రాంత్ హీరోగా కూడా చేయడం విశేషం. ఇక ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం..కథ..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2023, 07:22 PM IST
Spark Life Review :  మైండ్ కంట్రోల్ సైంటిఫిక్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..

Spark Life review: మెడికోగా వున్న జై (విక్రాంత్) కొందరి అమ్మాయిలను తెలీకుండా ఫాలో చేస్తుంటారు. కాగా తాను ఫాలో అవుతున్న అమ్మాయిలు కొద్దిసేపటికి సైకోలా బిహేవ్ చేస్తూ  ఒక్కొక్కరుగా చనిపోతుంటారు.  ఈ నేపథ్యంలో ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు పోలీసులు జై ను అనుమానించి అరెస్ట్ చేస్తారు. కాదా మరోపక్క అదే టైంలో అతను ప్రేమించే రుక్స‌ర్ థిల్లాన్  కూడా మరణిస్తుంది. ఆ తర్వాత మెహ్రిన్ వంతు అని తెలుసుకున్న ఆమె తండ్రి జైకు దూరంగా వుండమని చెబుతాడు. ఆ తర్వాత అసలేం జరిగింది? అనేది మెహ్రిన్ కు వివరిస్తాడు జై. జైకు ఆర్య అనే మరో పేరు కూడా వుంటుంది. ఇలా ఎందుకు రెండు పేర్లు వున్నాయి. మరి అమ్మాయిలంతా సైకోలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వీటి వెనుక దాగి వున్న రహస్యం ఏమిటి? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ

ఈ కథ మొత్తం ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం ట్రైబల్ ఏరియాల చుట్టూ సాగుతుంది. ఈ చిత్రంలోని సరి కొత్త పాయింట్  రాసుకొని దానిని బాగా తిరకెక్కించారు దర్శకుడు. ఎదుటి మనిషిలోని మెదడును కంట్రోల్ చేసే ప్రయోగంతో దేశంలోని ఉగ్రవాదుల్ని మన కంట్రోల్ లో తీసుకోవచ్చనే సరి కొత్త పాయింట్ చెప్పాడు. అయితే మొదటి భాగమంతా కథలోని టిస్ట్ ఏమీ అర్థంకాదు. హీరో హీరోయిన్ల చుట్టూ లవ్ ట్రాక్ తోపాటు హత్యలు జరగడం వరకు చూపించాడు.  ఇక అసలు కథ సెకండాఫ్ లోనే మొదలవుతుంది. ఆర్మీ డాక్టర్ టెర్రరిస్టులపై చేసే ప్రయోగాలవల్ల ఇలా అంధరూ చనిపోతున్నారంటూ సరికొత్త క్లూ ఇచ్చాడు. 
 
కానీ ఇలాంటి వైవిధ్యమైన కథకు భారీ హీరో అయితే సినిమా వేరేలా వుండేది. కొత్త వాడైనా విక్రాంత్ అన్ని  బాధ్యతలు మోయడం గొప్ప విషయమే అయిన నటనపరంగా విక్రాంత్ ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. ఇక నటీనటులు  నాజ‌ర్‌, సుహాసిని, బ్ర‌హ్మాజీ, షాయాజీ షిండే, ల‌హ‌రి వారి పరిధి మేరకు నటించారు.  కీలక పాత్రను గురు సోమ‌సుంద‌రంగా అద్భుతంగా చేశారు. 

టెక్నికల్ గా  అశోక్ కుమార్‌గారు వండ‌ర్‌ఫుల్ విజువల్స్‌ను ఇచ్చారు. సంగీతం, పాటలు బాగున్నాయి. చాలా రిచ్ గా నిర్మాణ విలువలతో రూపొందించారు.
 
కాగా ఇటువంటి సీరియస్ కథను మరింత కసరత్తు చేసి తీస్తేబాగుండేది. భారీ కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్ తో తీసిన ఈ సినిమా ఓటీటీకి మంచి ఫార్మెట్. ఈమధ్య రొటీన్ గా వస్తున్న తెలుగు సినిమాలకు భిన్నంగా వుంది. అయితే ఈ చిత్రం ఓ దశలో జాంబిరెడ్డిని గుర్తుకు చేస్తుంది. ఏది ఏమైనా మిలట్రీలో జరిగే సరికొత్త విధానాలు ఈ చిత్రం ద్వారా తెలియజపరిచారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా వర్క్ అవుతుందో తెలియాలి అంతే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

రేటింగ్ - 2.75/5

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News