Vijay-Rashmika: భర్త VD లాగా ఉండాలి.. ఇది నిజమే అంటూ రిప్లై పెట్టిన రష్మిక..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. మధ్యలో ఏముందో తెలియదు కానీ .. సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి గురించి ఎప్పుడు రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. దీనికి తోడు రష్మిక ప్రవర్తన కూడా.. విజయ్ దేవరకొండ తో తను ప్రేమలో ఉన్నట్టు ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లే ఉంటుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2024, 04:10 PM IST
Vijay-Rashmika: భర్త VD లాగా ఉండాలి.. ఇది నిజమే అంటూ రిప్లై పెట్టిన రష్మిక..

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న..ఈ జంటకి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. గీతా గోవిందం సినిమాలో కలిసి నటించిన ఈ జంట.. మొదటి చిత్రంతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి చేసిన డియర్ కామ్రేడ్ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ జంట క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందుకు ముఖ్య కారణం వీరిద్దరి మధ్య ప్రేమ ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తోంది అని ప్రేక్షకులు గట్టిగా భావించడమే.

వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా అన్న దానిపైన క్లారిటీ లేకపోయినా.. రష్మిక ప్రవర్తన తీరు మాత్రం విజయ్ దేవరకొండ తో తాను గాఢమైన ప్రేమలో ఉన్నట్టు.. చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు మరోసారి రష్మిక ఇచ్చిన ఒక రిప్లై విజయ్ దేవరకొండ తో తన ప్రేమ వార్తకు ఆర్జం పోసినట్టు ఉంది. 

తాజాగా రష్మిక మందన్న ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో రష్మిక అభిమానులు చేసిన ట్వీట్స్ కి సరదాగా సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఒక ఫ్యాన్.. రష్మికకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే. అని ఒక పోస్ట్ పెట్టాడు. ‘రష్మిక నేషనల్ క్రష్ కాబట్టి ఆమె భర్త చాలా స్పెషల్ గా ఉండాలి. ఆమె హస్బెండ్ VD లాగా ఉండాలి. తనను ప్రొటెక్ట్ చేయాలి. రష్మిక క్వీన్ కాబట్టి, ఆమె భర్త రాజులా ఉండాలి. VD అంటే వెరీ డేరింగ్ అని అర్ధం’ అంటూ పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ కి రష్మిక సమాధానమిస్తూ.. ఇది చాలా నిజం అంటూ ఒక లవ్ అలానే ఒక స్మైలీ ఎమోజి జత చేసి రిప్లై ఇచ్చింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది

 

అయితే ఈ ట్వీట్ లో రష్మిక అభిమాని VD అని స్పెషల్ గా పెట్టడం.. దానికి రష్మిక మురిసిపోతూ రిప్లై పెట్టడం చూసి.. మరోసారి అభిమానులు వీరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విజయ్, రష్మిక డేటింగ్ చేస్తున్నారు అని వార్తలు వచ్చినా కొన్ని సార్లు వారిద్దరూ కూడా అవన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. కానీ ప్రతిసారి ఈ ఇద్దరూ ఏదో ఒక విషయంలో వైరల్ అవుతూనే ఉండడంతో మరి కొద్ది రోజుల్లోనే వీరిద్దరి పెళ్లి వార్త బయటకువస్తుందని  నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్‌ పిలుపు

Also Read: Floating Bridge: లేదు లేదు 'తేలియాడే వంతెన' కొట్టుకుపోలే.. మేమే దాన్ని విడదీశాం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News