Vijay Beast first Lyrical song: వాలంటైన్స్​ డే స్పెషల్... విజయ్‌ 'బీస్ట్‌' నుంచి తొలి లిరికల్‌ సాంగ్‌ రిలీజ్..

Beast update: తమిళ స్టార్​ హీరో విజయ్​ నటిస్తున్న కొత్త సినిమా 'బీస్ట్​'. వాలంటైన్స్​ డే సందర్భంగా ఈ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2022, 08:35 PM IST
  • ‘బీస్ట్’ నుంచి 'అరబిక్ కుత్తు' సాంగ్ రిలీజ్
  • హీరో శివ కార్తికేయన్ రాసిన పాట
  • ఏప్రిల్ 14న బీస్ట్ విడుదల
Vijay Beast first Lyrical song: వాలంటైన్స్​ డే స్పెషల్... విజయ్‌ 'బీస్ట్‌' నుంచి తొలి లిరికల్‌ సాంగ్‌ రిలీజ్..

Vijay Beast first Lyrical song released: దళపతి విజయ్ నటిస్తున్న చిత్రం 'బీస్ట్‌' (Beast Movie). పూజా హెగ్డే (Pooja hegde) హీరోయిన్. వాలంటైన్స్​ డే (Valentine’s Day) సందర్భంగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్  ఇచ్చాడు విజయ్. ఈ మూవీలోని తొలి పాటను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్, పూజా డ్యాన్స్ ఇరగదీసినట్లు తెలుస్తోంది.  నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి అంచనాలు ఉన్నాయి. 

'బీస్ట్‌' నుంచి ‘'అరబిక్ కుతు' (Arabic kutu)’అనే లిరికల్‌ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి  అనిరుధ్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సాంగ్ ను అనిరుధ్‌ స్వయంగా పాడటం విశేషం.  ఈ పాటను యువ నటుడు శివ కార్తికేయన్‌ రాశారు. ఈ వీడియోను చూస్తే..మేకర్స్ చాలా రిచ్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విజయ్ తన మార్క్ డ్యాన్స్ తో ఇరగదీశాడు. బుట్టబొమ్మ పూజా మరోసారి తన అందంతో, స్టెప్స్ తో అలరించింది.

 ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ (Sun Pictures) సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాను ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నారు. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, నిర్మాత దిల్‌రాజుల‌తో క‌లిసి ద‌ళ‌ప‌తి విజ‌య్ త్వరలో పాన్ ఇండియా సినిమా చేయ‌బోతున్నారు. 

Also Read: Balayya Love Tips: అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చెయ్యాలో చెప్పిన బాలయ్య!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Linkhttps://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News