Vijay Antony -Love Guru Release Date: ఆసక్తి రేకిస్తోన్నవిజయ్ ఆంటోనీ 'లవ్ గురు'ట్రైలర్.. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఏప్రిల్ 11న విడుదల..

Vijay Antony -Love Guru Release Date: విజయ్ ఆంటోని పేరుకు తమిళ హీరో అయినా.. ఈయనకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. బిచ్చగాడు సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ పాపులర్ అయిన ఈయన.. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో పలకరించారు. తాజాగా ఈయన 'లవ్ గురు' సినిమాతో పలకరించబోతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 26, 2024, 09:55 PM IST
Vijay Antony -Love Guru Release Date: ఆసక్తి రేకిస్తోన్నవిజయ్ ఆంటోనీ 'లవ్ గురు'ట్రైలర్.. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఏప్రిల్ 11న విడుదల..

Vijay Antony -Love Guru Release Date: రెగ్యులర్ సినిమాలు కాకుండా.. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులకు అలరిస్తోన్న హీరో విజయ్ ఆంటోనీ. ఈయన కథానాయకుడిగా  నటిస్తున్న లేటెస్ట్ మూవీ "లవ్ గురు". ఆయన ఫస్ట్ టైమ్ తన జానర్‌కు భిన్నంగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్‌లో నటిస్తున్న చిత్రం 'లవ్ గురు'. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 'లవ్ గురు' సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న  విడుదల చేయబోతున్నారు. ఇవాళ 'లవ్ గురు' సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

'లవ్ గురు' ట్రైలర్ విషయానికొస్తే.. తండ్రి పోరు పడలేక పెళ్లికి ఓకే చెబుతుంది ప్రియా అనే అమ్మాయి. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం ఉండదు. పెళ్లి చూపుల టైమ్ లో కాబోయో భర్తకు కొన్ని కండీషన్స్ పెడుతుంది. అమ్మాయిని ఇష్టపడిన ఆ అబ్బాయి ఆమె చెప్పిన కండీషన్స్ అన్నింటికీ తలూపుతాడు. భార్యను వన్ సైడ్ గా లవ్ చేస్తాడు. షరతులన్నీ ఒప్పుకుంటాడు గానీ పెళ్లయ్యాక వాటిలో ఉన్న ఇబ్బందులు అర్థమవుతుంటాయి. పెళ్లయ్యాక ఎదురైన ఈ సమస్యల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు. భార్యను ప్రేమించడం ఎలాగో తెలుసుకున్నాడా లేదా అనే అంశాలతో ట్రైలర్ ఫన్, ఎంటర్ టైనింగ్ గా చూపించారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా 'లవ్ గురు' సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా చూపించారు.

నటీనటులు - విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ - ఫరూక్ జే బాష
సంగీతం -భరత్ ధనశేఖర్
ఎడిటింగ్, నిర్మాత - విజయ్ ఆంటోనీ
బ్యానర్ - విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్
సమర్పణ - మీరా విజయ్ ఆంటోనీ
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
రచన, దర్శకత్వం - వినాయక్ వైద్యనాథన్

Also Read:  Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్‌ చూస్తే నవ్వులే

Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News