Vijay Antony - Love Guru: కోలీవుడ్ కథానాయికకుడు కమ్ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనికి తెలుగు ప్రేక్షకులతో విడదీయరాని అనుబంధమే ఉంది. ఈయన సినిమాలు మాతృ భాష తమిళంలో కంటే ఇక్కడే ఎక్కువ ఆడిన సందర్భాలున్నాయి. ఇక తమిళంలో విజయ్ ఆంటోని నటించిన 'పిచ్చైకారన్' మూవీ తెలుగులో బిచ్చగాడు పేరుతో డబ్బై నిర్మాతలను కోటీశ్వరులను చేసింది. బిచ్చగాడు సక్సెస్ తర్వాత విజయ్ ఆంటోని యాక్ట్ చేసిన ప్రతీ మూవీ తెలుగులో విడుదలవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ కోవలో ఈయన హీరోగా నటించిన 'లవ్ గురు'మూవీ ఈ నెల 11 ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర మంచి మౌత్ టాక్‌తో రన్ అవుతోంది.
తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసింది. "లవ్ గురు" సినిమా ప్రీమియర్స్ నుంచే మీడియా నుంచి పాజిటివ్ టాక్, మంచి రివ్యూస్ తెచ్చుకుంది. ఫస్ట్ డే థియేటర్స్ లోనూ ప్రేక్షకులు సినిమా తమకు బాగా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా రోజు రోజుకూ చేరువవుతోంది.
దీంతో ఈ సినిమా డే 1 కంటే బెటర్ గా డే 2 కలెక్షన్స్ డే 2 కంటే డే 3 కలెక్షన్స్ దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇప్పటికే ఈ సినిమా దాదాపు రూ. 3 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని సమాచారం. తమిళంలో దాదాపు రూ. 10 కోట్ల వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. "లవ్ గురు" సినిమాలోని సన్నివేశాలు ఎంటర్ టైన్ చేస్తూనే ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. తనను ద్వేషించే భార్యను ప్రేమతోనే గెలవాలని ప్రయత్నించే భర్త పాత్రలో విజయ్ ఆంటోనీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. లవ్ గురు సినిమాలో విజయ్ ఆంటోని సరసన మృణాళిని రవి కథానాయికగా నటించింది. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు.
Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter