Bichagadu 3: బిచ్చగాడు 3 కూడా వస్తుందన్న విజయ్ ఆంటోనీ.. బెంబేలుఎత్తుతున్న జనం!

Vijay Antony confirms Bichagadu 3: 2016వ సంవత్సరంలో బిచ్చగాడు సినిమాతో తమిళంలో సూపర్ హిట్ అందుకున్న విజయ్ ఆంటోని ఈ మధ్య సెకండ్ పార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక త్వరలో బిచ్చగాడు 3 కూడా  ఉంటుందని ప్రకటించారు విజయ్ ఆంటోనీ.

Written by - Chaganti Bhargav | Last Updated : May 22, 2023, 03:27 PM IST
Bichagadu 3: బిచ్చగాడు 3 కూడా వస్తుందన్న విజయ్ ఆంటోనీ.. బెంబేలుఎత్తుతున్న జనం!

Vijay Antony confirms Bichagadu 3 Release plans: మహాత్మా సినిమాతో టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా పరిచయమైన విజయ్ ఆంటోని తరువాత తమిళ్ లో చిన్న చిన్న సినిమాలు చేస్తూ హీరోగా మారాడు. 2016వ సంవత్సరంలో బిచ్చగాడు సినిమాతో తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ఆయన అదే సినిమాని తెలుగులో కూడా కొన్ని నెలల వ్యవధిలో విడుదల చేసి తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టి అందరికీ పరిచయం అయ్యాడు.

బిచ్చగాడు సినిమాలో మదర్ సెంటిమెంట్ అందరికీ కనెక్ట్ అవ్వడంతో ఆ సినిమా సూపర్ హిట్ అవడమే కాక వసూళ్ల వర్షం కూడా కురిపించింది. ఇక ఈ సినిమాకి ఈ మధ్యనే ఒక సీక్వెల్ కూడా చేసి రిలీజ్ చేశారు. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మొదటి రోజు రెండు కోట్ల 32 లక్షల వసూలు చేస్తే రెండో రోజు కోటి 62 లక్షలు,  మూడవ రోజు కోటి 58 లక్షలు మొత్తం కలిపి 5 కోట్ల 82 లక్షల షేర్ 10 కోట్ల 85 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

Also Read: The Kerala story:ది కేరళ స్టోరీ బ్యాన్.. కోర్టుకి తమిళనాడు ప్రభుత్వం ఆసక్తికర సమాధానం

ఇక ఈ సినిమా ఓవరాల్ తెలుగు బిజినెస్ 6 కోట్ల రూపాయలకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్గా 6:50 కోట్లు ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా 68 లక్షలు రూపాయలు కనుక వసూలు చేస్తే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది. ఇక బిచ్చగాడు 2016 రిలీజ్ అయిన సమయంలో ఆ సినిమాలో ఒక బిచ్చగాడు చేత 500 1000 రూపాయల నోట్లు రద్దు చేయించమని డైలాగ్ చెప్పించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అదే నిజమైంది. ఇక ఈ మధ్య బిచ్చగాడు 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా 2000 నోట్లు చలామణి నుంచి తప్పిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించింది.

ఈ నేపద్యంలో బిచ్చగాడుకి నోట్ల అంశానికి ఏదో లింక్ ఉందని అంటున్నారు. ఇక బిచ్చగాడు 3 కూడా వస్తే 500 నోట్లు కూడా రద్దు చేస్తారేమో అనే ప్రచారం జరుగుతున్న సమయంలో విజయ్ ఆంటోనీ తమ బిచ్చగాడు 3 సినిమా 2025వ సంవత్సరంలో రిలీజ్ అవ్వబోతుందని ప్రకటించి షాకిచ్చారు. దీంతో నెటిజన్లు అప్పటికల్లా 500 నోట్లు ఏమైనా ఉంటే అన్నీ బ్యాంకులో వేసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Sarath Babu Died: టాలీవుడ్లో విషాదం.. శరత్ బాబు కన్నుమూత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News