Venkatest లేటెస్ట్ మూవీకి కరోనా ఎఫెక్ట్, విక్టరీ వెంకటేష్ Narappa Movie రిలీజ్ వాయిదా

Victory Venkatest Latest Movie Narappa | తమిళంలో హీరో ధనుష్ నటించిన చిత్రం  అసురన్  తెలుగులో రీమేక్ నారప్ప మూవీగా వస్తోంది. విక్టరీ వెంకటేష్ నటించిన తాజాగా సినిమా నారప్ప(Narappa Movie)పై కరోనా ప్రభావం పడింది. సినిమా విడుదల వాయిదా వేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 29, 2021, 12:48 PM IST
Venkatest లేటెస్ట్ మూవీకి కరోనా ఎఫెక్ట్, విక్టరీ వెంకటేష్ Narappa Movie రిలీజ్ వాయిదా

కరోనా మహమ్మారి ప్రభావాన్ని సినీ ఇండస్ట్రీ వరుసగా రెండో ఏడాది ఎదుర్కుటుంది. గత ఏడాది కొన్ని నెలలపాటు సినిమా థియేటర్లు బంద్ కాగా, తాజాగా అదే పరిస్థితి తలెత్తడంతో ఇదివరకే థియేటర్లు మూసివేశారు. విక్టరీ వెంకటేష్ నటించిన తాజాగా సినిమా నారప్ప(Narappa Movie)పై కరోనా ప్రభావం పడింది. సినిమా విడుదల వాయిదా వేసినట్లు మూవీ యూనిట్ తెలిపింది.

తమిళంలో హీరో ధనుష్ నటించిన చిత్రం  అసురన్  తెలుగులో రీమేక్ నారప్ప మూవీగా వస్తోంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 14న నారప్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా మూవీ విడుదలను వాయిదా వేస్తూ మూవీ యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు, సురేష్ ప్రొడక్షన్స్ వెల్లడించారు. ఈ మేరకు నారప్ప వాయిదా వివరాలు ట్వీట్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నారప్ప సినిమాలో విక్టరీ వెంకటేష్(Victory venkatesh) సరసన ప్రియమణి నటిస్తోంది. కలైపులి ఎస్. థానుతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నారప్ప సినిమాను నిర్మిస్తోంది

Also Read: Tollywood స్టైలిష్ స్టార్ Allu Arjunకు కరోనా పాజిటివ్, మెగా ఫ్యాన్స్‌లో కలవరం

‘నారప్ప సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ మనవి. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో అందరి ఆరోగ్యం, రక్షణ గురించి ఆలోచించి నారప్ప మూవీ విడుదలని వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తరువాత అతి త్వరలోనే సినిమాను మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ మహమ్మారి వీలైనంత త్వరగా దూరం కావాలని, అందరూ క్షేమంగా ఉండాలిన ఈ చిత్నానికి ఇష్టంతోనూ, అంకితభావంతోనూ పనిచేసిన ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అందరం ఇళ్లల్లోనే ఉండి మనపట్ల, మన కుటుంబసభ్యుల పట్ల జాగ్రత్తగా ఉందాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసికట్టుగానే ఎదుర్కొందాం. 

Also Read: Vakeel Saab Movie: వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 30 న విడుదల

అందరం మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే మనం పొరుగువారికీ సమాజానికి చేసే గొప్ప సాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్నందరినీ అలరించాలని కోరుకుంటూ నారప్ప టీం అని’ #NarappaPostponed స్టే హోమ్ స్టే సేఫ్ అంటూ ట్వీట్ ద్వారా సందేశాన్ని సైతం ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News