Playback Singer Vani Jayaram Passed Away: సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది, కే విశ్వనాద్ మరణించిన రెండో రోజులకే ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ వయోభారంతో కన్ను మూశారు. 78 ఏళ్ల వాణీ జయరామ్‌కు ఇటీవలే అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది. ఆమె ఇంట ఆ ఆనందం ఇంకా తగ్గకముందే ఆమె మరణవార్త సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక వాణీ జయరామ్ తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడతో సహా అనేక భారతీయ భాషలలో పాడగా తెలుగులో ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
వాణి జయరామ్ 1945 నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో ఒక తమిళ కుటుంబంలో జన్మించగా ఆమె చిన్నప్పుడే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. ఆనే చిన్ననాటి పేరు కాలబాని కాగా తల్లి పద్మావతి, వాణిని శిక్షణ కోసం తన గురువు రంగ రామానుజ అయ్యంగార్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ వాణి కవి ముత్తుస్వామి దీక్షితుల పద్యాలను కూడా నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించారు. తరువాత ఆమె కదలూరు శ్రీనివాస అయ్యంగార్, టీఆర్ బాలసుబ్రహ్మణ్యం సహా ఆర్ఎస్ మణి వంటి వారి వద్ద కర్నాటక సంగీతంలో అధికారికంగా శిక్షణ పొందారు.
1960వ దశకం చివరిలో, వివాహం తర్వాత, ఆమె తన భర్త జయరామ్‌తో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఆమె గాన ప్రావీణ్యాన్ని తెలుసుకున్న జయరామ్ బాణిని హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందేలా ప్రోత్సహించడంతో ఆమె సౌత్ ఇండియన్ సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె సింగింగ్ అతని కెరీర్ 1971లో ప్రారంభమవగా నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె పాటలు పాడుతూనే ఉన్నారు. అలా ఆమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ బాషలలో వేల సినిమాల్లో 10 వేలకు పైగా పాటలను ఆలపించారు. ఇక ఆమె తన కెరీర్లో ఎన్నో భక్తి గీతాలు పాడారు.
ఆమె తమిళనాడుకు చెందిన గాయని అయినప్పటికీ, ఆమె తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, ఒరియా, గుజరాతీ సహా బెంగాలీ వంటి అనేక భారతీయ భాషలలో పాటలు పాడింది. ఆమె ఉత్తమ నేపథ్య గాయనిగా భారత జాతీయ అవార్డులు మూడు సార్లు, ఉత్తమ నేపథ్య గాయనిగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు గుజరాత్ రాష్ట్రాల అవార్డులను గెలుచుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం గమనార్హం. తెలుగులో ఆమె స్వాతికిరణం, పెళ్ళి పుస్తకం, స్వర్ణకమలం, ఆరాధన, శృతిలయలు, సీతాకోకచిలుక, శంకరాభరణం, మరోచరిత్ర, అంతులేని కథ, సీతా కళ్యాణం వంటి సినిమాలలో ఆమె సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు.
Also Read: Dhanush Focus; విజయ్ దెబ్బకు గుణపాఠం నేర్చుకున్న ధనుష్.. అందుకే ఆ తప్పు చేయకుండా!
Also Read: Lakshmi Parvathi on Jr NTR: లేట్ అయింది, ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదు...లక్ష్మీ పార్వతి సంచలనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.