Jabardasth Latest Promo: షోలో అవమానం.. లేచి వెళ్లిపోయిన ఇంద్రజ.. నిజామా..? లేక TRP స్టాంటా..?

Actress Indraja in Jabardasth: బుల్లితెరపై ఇంద్రజ మీద ఇప్పుడు నెగెటివ్ ఇమేజ్ ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. ఆమె ఏం చేసినా, చెప్పినా కూడా అతి అన్నట్టుగా అయిపోయింది. మొదట్లో ఇంద్రజకు ఫుల్ పాజిటివ్ ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆమె సైతం టీఆర్పీ స్టంట్ల మాయలో పడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2023, 12:52 PM IST
  • నెట్టింట్లో జబర్దస్త్ ప్రోమో సందడి
  • ఇంద్రజను ప్రశ్నించిన వెంకీ మంకీ టీం
  • షో నుంచి లేచి వెళ్లిపోయిన ఇంద్రజ
Jabardasth Latest Promo: షోలో అవమానం.. లేచి వెళ్లిపోయిన ఇంద్రజ.. నిజామా..? లేక TRP స్టాంటా..?

Jabardasth Latest Promo: బుల్లితెరపై ప్రస్తుతం వస్తున్న షోల్లో ఏవీ కూడా జనాలను అంతగా అట్రాక్ట్‌ చేయడం లేదు. ఎంటర్టైన్మెంట్ షోలన్నీ కూడా టీఆర్పీ స్టంట్లతో బాదేస్తున్నాయి. అరిగిపోయిన ప్రమోషనల్ టీఆర్పీ స్టంట్లతో జనాలను ఇంకా బోర్ కొట్టించేస్తున్నారు. షోల్లోనే పెళ్లి చేసుకోవడం, లవర్‌లను పరిచయం చేయడం, టీం లీడర్లు జడ్జ్‌లను నిలదీసినట్టుగా చూపించడం వంటివి ఇది వరకే ఎన్నో చూసేసి ఉన్నారు జనాలు. అయినా కూడా మళ్లీ అదే స్ట్రాటజీలతో ముందుకు వస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో పాత పద్దతులనే ఫాలో అయ్యారు. ఓ జంటను తీసుకొచ్చి స్టేజ్ మీదనే తాళి కట్టించేశారు. ఇలా మరొక లవ్ ట్రాక్‌కు తెరదీశారు. అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే చివర్లో వెంకీ మంకీ టీంతో చేయించిన టీఆర్పీ స్టంట్లు మరో లెవెల్‌గా నిలిచాయి. ప్రోమోలో ఏం చూపించారో ఓ సారి చూద్దాం.

వెంకీ మంకీ టీంకు ఇంద్రజ, కృష్ణ భగవాన్‌ ఇద్దరూ కూడా తొమ్మిది మార్కులు వేసినట్టున్నారు. తన స్కిట్ బాగున్నా కూడా ఎందుకు తక్కువ మార్కులు వేశారని నిలదీశాడు కమెడియన్. ఎక్కువ మార్కులు వేసినప్పుడు ఎందుకు వేశారు అని అడగలేదు ఎందుకు? అని రివర్స్‌లో నిలదీసింది ఇంద్రజ.

Also Read: Ravanasura Twitter Review: రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ ఇలాంటివి చేయకు అన్న!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News