Vijay Devarakonda 12 Movie Poster Copied: ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితి అందరం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో మొదటి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత అర్జున్ రెడ్డి,గీతగోవిందం వంటి సినిమాలతో తెలుగులో రౌడీ హీరోగా ఒక్కసారిగా క్రేజ్ మొత్తాన్ని సంపాదించాడు. ఒక రకంగా యూత్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ గనక పరిశీలిస్తే పెద్ద హీరోలకు సైతం మెంటల్ ఎక్కి పోవడం ఖాయం. అలా అతి తక్కువ కాలంలోనే సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఈ హీరో ప్రస్తుతానికి వరుస సినిమాలు లైన్ లో పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక చివరిగా విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. కానీ ఏ ఒక్క భాషలోనూ ఈ సినిమా హిట్ అవ్వలేదు. దారుణమైన డిజాస్టర్ ఫలితం రావడంతో పూరి జగన్నాథ్ కాంబినేషన్లో విజయ్ దేవరకొండ హీరోగా చేయాల్సిన జనగణమన అనే సినిమా కూడా ఆగిపోయింది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా మొదలుపెట్టాడు. మజిలీ, నిన్ను కోరి వంటి సినిమాలు చేసి ఉన్న శివ నిర్వాణకు మంచి లవ్ స్టోరీస్ తెరకెక్కిస్తాడనే పేరు ఉంది.
Also Read: Another Malayali: తెలుగులోకి మరో మలయాళ హీరోయిన్...వైష్ణవ్ తేజ్ సరసన ఎంట్రీ!
అలాంటి ఆయన దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఖుషీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుండగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మరో సినిమా కూడా లైన్లో పెట్టాడు. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ 12వ సినిమా అధికారికంగా ప్రకటించడమే కాదు పూజా కార్యక్రమాలు కూడా లాంఛనంగా జరిగాయి. ఇక విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అభిమానుల కోసం ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే కావాలని విజయ్ దేవరకొండ ఫోటోని కత్తిరించినట్లుగా కనిపిస్తోంది.
అయితే ఈ పోస్టర్ కొత్తగా ఉందని కొందరు కామెంట్లు చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇది కొత్త పోస్టర్ ఏమీ కాదని ఆగ్రో అనే ఆస్కార్ అవార్డు సైతం దక్కించుకున్న ఒక థ్రిల్లర్ సినిమాకి సంబంధించిన పోస్టర్ని పోలి ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని మీడియా సంస్థలు కొంతమంది జర్నలిస్టులు ఎందుకు మన మేకర్స్ కొత్తగా ఆలోచించలేక పోతున్నారు? హాలీవుడ్ నుంచి కాన్సెప్ట్ తీసుకురావడం, ఐడియాలు తీసుకురావడమే కాదు ఏకంగా అక్కడి పోస్టర్లను కూడా కాపీ కొడుతున్నారా? అంటూ విమర్శలు వర్షం కురిపించారు.
ఇక ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన ఈ సినిమా నిర్మాత నాగ వంశీ ఆగ్రో సినిమా పోస్టర్ని తమ కాపీ కొట్టలేదని చాలా స్పై థ్రిల్లర్స్ కి ఇలాంటి పోస్టర్లే ఉంటాయని ఆయన ఉదాహరణలు చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ సినిమా కూడా ఒక స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నామని పీరియాడిక్ స్పై థ్రిల్లర్ కావడంతో తాము పోస్టర్ను ఇలా డిజైన్ చేశామని చెప్పుకొచ్చారు. ఇలా పోస్ట్ ను చూసి ఒక నిర్ణయానికి వచ్చి రాళ్లు వేసే ముందు అసలు కాంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఇలా ఒక పోస్టర్ ఉందంటే గతంలో ఏం జరిగింది? దేనికి ఇలాంటివి వాడతారు అనే విషయం తెలుసుకుని ఇలా జడ్జిమెంట్ చేయడం బెటర్ అంటూ నాగవంశీ కామెంట్లు చేశారు.
Also Read: Anasuya Bharadwaj: మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్ధం చేసుకోండి.. మళ్ళీ అనసూయ సంచలన ట్వీట్!