Vani Jayaram Postmortem Report Latest: సుమారు 19 భారతీయ భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడి శ్రోతలను అలరించిన సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని నుంగంబాక్కంలోని ఒక అపార్ట్మెంట్లో ఆమె నివసిస్తున్న సమయంలో ఆమె అనుమానాస్పద స్థితిలో పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను హాస్పిటల్ కి తరలించారు.
అయితే ఆమెను హాస్పిటల్ కి తరలించే సమయానికి ఆమె కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. వాని జయరాం ముఖం మీద గాయాలు ఉండడంతో పోలీసులు ఆమె మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ఇక తాజాగా ఆమె మృతి మీద ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు వెల్లడించారు. వాణీ జయరాం ప్రమాదవశాత్తు కింద పడి మరణించినట్లుగా ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక సూచించిందని వారు వెల్లడించారు.
ముందు అనుమానించిన పోలీసులు అనంతరం ఈ మృతి విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక మరణించిన సమయంలో ఆమె ఒంటరిగా ఉన్నారని తలుపు కూడా లోపలి నుంచి లాక్ చేసి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఆమె ఇంటి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ సైతం పరిశీలించిన పోలీసులు సీసీ ఫుటేజ్ లో సైతం ఎలాంటి అనుమానాస్పద కదలికలకు కనిపించలేదని పేర్కొన్నారు.
తమిళనాడులోని వేలూరులో జన్మించిన వాణి జయరాం వివాహం వరకు సింగింగ్ కెరియర్ మొదలుపెట్టలేదు, వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉద్యోగరీత్యా ముంబై వెళ్ళిన ఆమె అక్కడ సింగింగ్ కెరీర్ మొదలు పెట్టి సుమారు 19 భారతీయ భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడి అనేక అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు. ఇక సింగర్ వాణి జయరాం మరణించడానికి కొన్ని రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ అవార్డు కూడా ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో ఆమె అవార్డు తీసుకోవాల్సి ఉండగా ప్రమాదవశాత్తు తన నివాసంలో గాయపడటంతో ఆమె కన్నుమూశారు.
Also Read: Balakrishna on Nurses: నేను నర్సులను ఏమీ అనలేదు..వక్రీకరించారు, వివాదంపై బాలయ్య క్లారిటీ!
Also Read: Lata Mangeshkar Death anniversary: ఆరోజుల్లోనే 'లతా'ను చంపడానికి పాయిజన్ ఇచ్చారు.. ఏమైందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.