Kondapolam trailer: ఉప్పెన హీరో కొండపొలం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Kondapolam trailer launching date: ఉప్పెన మూవీతో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ నటించిన తర్వాతి సినిమా కొండపొలం. ఫేమస్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వై రాజీవ్ రెడ్డి, జే సాయి బాబు నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ (Actress Rakul preet Singh) జంటగా నటిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2021, 07:21 PM IST
Kondapolam trailer: ఉప్పెన హీరో కొండపొలం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Kondapolam trailer launching date: ఉప్పెన మూవీతో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ నటించిన తర్వాతి సినిమా కొండపొలం. ఫేమస్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వై రాజీవ్ రెడ్డి, జే సాయి బాబు నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ (Actress Rakul preet Singh) జంటగా నటిస్తోంది. తొలి సినిమాతోనే 2021లోనే మొట్టమొదటి భారీ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా విడుదలవుతున్న రెండో సినిమా ఇది. 

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, ఇప్పటికే హీరోగా నిలదొక్కుకున్న సాయిధరమ్ తేజ్‌కి (Sai dharam Tej) సోదరుడిగా మెగా అభిమానుల ముందుకొచ్చిన వైష్ణవ్ తేజ్.. మొదటి సినిమాతోనే తనకంటూ ఓ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ సొంత గుర్తింపుతోనే ఇప్పుడు కొండ పొలం సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

 

క్రిష్ లాంటి సీనియర్ డైరెక్టర్ (Director Krish) తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సహజంగానే కొండ పొలం మూవీపై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు గత నెలలో విడుదల చేసిన కొండ పొలం ఫస్ట్ లుక్ వీడియో (Kondapolam first look) ఇంకొంత ఇంటెన్సిటీని పెంచింది. 

 

కొండ పొలం మూవీ అక్టోబర్ 8న విడుదల కానున్నట్టు మేకర్స్ ఈ ఫస్ట్ లుక్ వీడియోతో కన్ఫామ్ చేసిన నేపథ్యంలో కొండ పొలం మూవీ ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వారి ఎదురుచూపులకు సమాధానంగా తాజాగా కొండపొలం ట్రైలర్ రిలీజ్ డేట్ (Kondapolam trailer releasing date) ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 3:30 గంటలకు కొండ పొలం మూవీ ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x