Unni Mukundan: ఏడు సంవత్సరాల పాటు హీరోయిన్ నెంబర్ ని బ్లాక్ చేసిన హీరో.. ఏమైందంటే

Mahima Nambiar: జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ స్టార్ హీరో ఉన్నిముకుంద‌న్. కాగా ఈ హీరో ఒక హీరోయిన్ నెంబర్ ని దాదాపు 7 సంవత్సరాలు బ్లాక్ చేసారట.. ఈ వివరాలు ఒకసారి చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 11, 2024, 12:13 PM IST
Unni Mukundan: ఏడు సంవత్సరాల పాటు హీరోయిన్ నెంబర్ ని బ్లాక్ చేసిన హీరో.. ఏమైందంటే

Unni Munkundan:
మ‌ల‌యాళ స్టార్ హీరో ఉన్నిముకుంద‌న్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయాలు అవసరం లేదు. అనుష్క నటించిన భాగమతి సినిమాలో హీరోగా కనిపించి అందరినీ మెప్పించాడు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించాడు ఈ హీరో. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ హీరో గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది..

అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ మలయాళీ హీరో  న‌టిస్తున్న చిత్రం జై గ‌ణేష్‌. రంజిత్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ చిత్రంలో మ‌హిమ నంబియార్ హీరోయిన్‌గా నటించగా ఈ సినిమా ఈరోజు విడుదల అయింది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ మ‌హిమ నంబియార్ మాట్లాడుతూ ఏడేళ్ల పాటు హీరో ఉన్నిముకుంద‌న్ త‌న నంబ‌ర్‌ను బ్లాక్ చేశాడ‌ని షాపింగ్ విషయం బయట పెట్టింది.

ఉన్నిముకుంద‌న్, మ‌హిమా నంబియార్ లు కలిసి 2017లో విడుద‌లైన మాస్ట‌ర్ పీస్ సినిమాలో న‌టించారు. అయితే ఆ చిత్రం విడుద‌లైన త‌రువాత ఉన్ని ముకుందన్ త‌న నంబ‌ర్‌ను బ్లాక్ చేశాడ‌ని మ‌హిమ చెప్పుకొచ్చింది.’ సినిమా స్రిప్ట్ రైట‌ర్ ఉద‌య్‌కృష్ణ ద‌గ్గ‌రి నుంచి ఉన్ని ముకుంద‌న్ నంబ‌ర్‌ను తీసుకున్నా. ఆ త‌రువాత ఆయ‌న‌కు వాట్సాప్‌లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను. నేను మ‌హిమ‌ను. నేనెవ‌రో నీకు తెలుసుకు అని అనుకుంటున్నాను. ఉద‌యన్ నుంచి నీ నంబ‌ర్ తీసుకున్నా అని చెప్పుకొచ్చాను. ఆ వాయిస్ మెసేజ్‌లో ఉద‌య‌న్ అని రెండు మూడు సార్లు అన్నాను. ఆ వాయిస్ మెసేజ్ విన‌గానే తాను నా నెంబర్ ని వాట్సాప్ లో బ్లాక్ చేశాడు. ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేశాడో నాకు అర్థం కాలేదు. ఆ త‌రువాత ఉద‌య‌న్‌కు ఉన్ని ఫోన్ చేశాడు. నాకు అహంకారం ఎక్కువ అని, ఉద‌య‌న్ అని పిలుస్తోంద‌ని, ఓ సీనియ‌ర్‌ను ఇలాగేనా పిలిచేది అని అత‌డితో ఉన్ని చెప్పాడ‌ట‌. అందుకని నా నెంబర్ వాట్సాప్ లో ఏడు సంవత్సరాల పాటు బ్లాక్ చేశాడు’ అంటూ మ‌హిళా నంబియార్ ఈ ప్రమోషనల్ ఈవెంట్లో చెప్పుకొచ్చింది. 

అయితే.. ఉదయకృష్ణతో తనకున్న పరిచయం వల్లే అతడిని ‘ఉదయన్’ అని ఆప్యాయంగా పిలిచాన‌ని, ఆ విషయం ఉన్నికి తెలియక ఇలా చేశారని తెలియజేసింది. ఇక ఆ తరువాత ఇదే విషయంపై ఉన్ని ముకుంద‌న్ స్పందించాడు. ఆ స‌మ‌యంలో కోపంతో ఆమె నంబ‌ర్‌ను బ్లాక్ చేసిన‌ట్లు, కానీ చేసిన త‌రువాత నంబ‌ర్ బ్లాక్ చేసిన‌ విష‌యాన్నే తాను మ‌రిచిపోయిన‌ట్లు.. అందుకే తాను ఏడు సంవత్సరాలు చూసుకోనట్లు చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ల త‌రువాత RDX సినిమా విజయం సాధించ‌డంతో ఆ సినిమాలో మ‌హిమ‌ను చూశాను. ‘అప్పుడు నాకు తనని బ్లాక్ చేసిన విషయం గుర్తొచ్చి అన్బ్లాక్ చేసి తనకు మెసేజ్ పంపాను’ అని చెప్పుకొచ్చారు.

Also Read: KCR Ugadi Panchangam: కేసీఆర్‌కు మళ్లీ గెలుపు అవకాశాలు.. కేటీఆర్‌కు కొంత కష్టమే.. ఉగాది పంచాంగం ఇలా..

Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్‌ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్‌.. ఇలా ప్రచారం

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News