/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌కు తన అభిమానులంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ కోరే చిన్న చిన్న కోరికలు కూడా తీరుస్తారాయన. ఇటీవలే సోషల్ మీడియాలో ఓ షారుఖ్ ఖాన్ అభిమాని కథ బాగా పాపులరైంది.

అరుణ అనే ఓ క్యాన్సర్ పేషెంట్ షారుఖ్ ఖాన్‌కి పెద్ద ఫ్యాన్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఎప్పటికైనా షారుఖ్‌ను తాను కలవాలని భావిస్తున్నానని.. అదే తన చివరి కోరికని తన సన్నిహితులతో తెలిపారట. ఎవరో ఆమె చెప్పిన మాటలను తన ఫోటోతో సహా ట్విటర్‌లో పోస్టు చేశారు. #SRKmeetsAruna అనే హ్యాష్ టాగ్‌తో బాగా పాపులరైన ఆ పోస్టును కొన్ని వేలమంది  షేర్ చేశారు.

కొంతమంది అభిమానులు అరుణ తరఫున వకాల్తా పుచ్చుకొని మరీ.. ఈ అభిమాని కోరికను షారుఖ్ తీర్చాల్సిందిగా కోరారు. ఈ ట్వీట్ షారుఖ్‌కు చేరేవరకు రీట్వీట్ చేయాల్సిందిగా కోరారు. ఏమైతేనేం.. ఎట్టకేలకు ఆ ట్వీట్ షారుఖ్ వరకు చేరింది. తన అభిమాని గురించి తెలుసుకున్న షారుఖ్ ఆమె ఆరోగ్యం కోసం తాను భగవంతున్ని ప్రార్థిస్తానని.. ఆమె ట్వీట్ తనవరకు చేరేందుకు ప్రయత్నించిన మిగతా అభిమానులకు కూడా ధన్యవాదాలని చెప్పారు. 

షారుఖ్ ఆమెను వ్యక్తిగతంగా కలవకపోయినా, ఆమె కోసం ఒక వీడియోలో తన సందేశమిస్తూ.. ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆమె క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం ఎందరికో స్ఫూర్తి అని, ఆమె త్వరగా కోరుకోవాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తనును ఇంతలా అభిమానిస్తున్నందుకు, ప్రేమిస్తున్నందుకూ ఆమెకు ధన్యవాదాలు కూడా తెలిపారు. తను ఆసుపత్రిలో ఉన్న సంగతి తనకు ఆమె పిల్లలు చేసిన పోస్టు ద్వారా తెలిసిందని, ఆమె వేగంగా కోలుకోవాలని తమ కుటుంబ సభ్యులందరం దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఆమె ధైర్యంగా ఉండాలని.. వీలుంటే తనను ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తానని కూడా ఆయన చెప్పారు. 

 

Section: 
English Title: 
Twitter Helps A Fan Suffering From Cancer Meet Shah Rukh Khan - Watch Video
News Source: 
Home Title: 

షారుఖ్ మనసును కదిలించిన ఫ్యాన్ కథ

షారుఖ్ మనసును కదిలించిన ఫ్యాన్ కథ
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes