TV Artist Sreevani : కొత్తింట్లోకి నటి శ్రీవాణి.. బుల్లితెర తారల సందడి

TV Artist Sreevani New House బుల్లితెర నటి శ్రీవాణి తాజాగా కొత్తింట్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. శ్రీవాణి గృహ ప్రవేశ వేడుకలో హిమజ వంటి సెలెబ్రిటీలు సందడి చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2022, 10:50 PM IST
  • బుల్లితెర తారల సందడి
  • కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రీవాణి
  • యూట్యూబ్ ఆదాయమే కారణమా?
TV Artist Sreevani : కొత్తింట్లోకి నటి శ్రీవాణి.. బుల్లితెర తారల సందడి

Artist Sreevani New House Warming Ceremony బుల్లితెర నటి శ్రీవాణి, ఆమె భర్త విక్రమాదిత్యలు చేసే సందడి మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో పోస్టులు, యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలు, పండుగ ఈవెంట్లో కామెడీ స్కిట్లు, డ్యాన్సులు చేస్తూ శ్రీవాణి విక్రమాదిత్య జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటోంది. అయితే మధ్యలో శ్రీవాణి గొంతు మూగబోవడం, అయినా కూడా వీడియోలను చేస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. మాటలు అంతగా రాకపోయినా సైగలతో మ్యానేజ్ చేసేసింది శ్రీవాణి.

అలా అంత విపత్కర పరిస్థితిలో ఉండి.. నెల రోజుల పాటు గొంతు మూగబోయినా కూడా ఎక్కడా దిగులు చెందలేదు. కుంగిపోలేదు. నవ్వుతూనే యూట్యూబ్‌లో వీడియోలు చేసింది. ఆ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం బుల్లితెర తారలంతా కూడా యూట్యూబ్ వీడియోల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ యూట్యూబ్‌లో రకరకాల వీడియోలు చేసి వదిలి పెడుతుంటారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Himaja💫 (@itshimaja)

ఇలా శ్రీవాణి సైతం తన భర్త, కూతురితో కలిసి వీడియోలు షేర్ చేస్తుంటుంది. అలా బుల్లితెర సీరియల్లు, ప్రోగ్రాం, యూట్యూబ్ ద్వారా భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్టుగా ఉంది. తాజాగా శ్రీవాణి కొత్తింట్లోకి అడుగుపెట్టేసింది. ఆమె నిర్వహించిన గృహ ప్రవేశ వేడుకకు బుల్లితెర తారలంతా కూడా వచ్చి సందడి చేశారు. జబర్దస్త్ టీం నుంచి పవిత్ర వచ్చింది. బిగ్ బాస్ టీం నుంచి హిమజ వచ్చింది.

ఇక ఆమె స్నేహితులైన అంజలి పవన్, అన్షు, నవీన ఇలా చాలా మంది బుల్లితెర తారలు సందడి చేశారు. గృహ ప్రవేశం సందర్భంగా శ్రీవాణికి హిమజ కంగ్రాట్స్ తెలిపింది. మీ ఇంట్లోని ప్రతీ రూం సంతోషాలతో నిండాలని కోరుకుంది. ప్రస్తుతం శ్రీవాణి కొత్తింటి కబుర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ మంజుల ఘట్టమనేని పోస్ట్.. అదే చివరిది అవుతుందని అనుకోలేదట

Also Read : Hari Hara Veera Mallu : ఇరవై ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్‌ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. క్రిష్‌ కామెంట్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News