Adipurush OTT Streaming: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఆదిపురుష్‌' ఏ OTTలో.. ఎపుడు స్ట్రీమింగ్‌ కానుందంటే..?

Adipurush Movie OTT Date: ఎంతగానే ఎదురుచూస్తున్న 'ఆదిపురుష్' ఇవాళ ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈచిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2023, 03:03 PM IST
Adipurush OTT Streaming: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఆదిపురుష్‌' ఏ OTTలో.. ఎపుడు స్ట్రీమింగ్‌ కానుందంటే..?

'Adipurush' OTT Streaming: ప్రభాస్, కృతిసనన్ సీతారాములుగా.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆదిపురుష్' (Adipurush). ఆధునిక రామాయణంగా రూపొందించిన చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది ఈ మూవీ.  విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ రామాయణం అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో రాఘవుడిగా ప్రభాస్ నటన, జానకిగా కృతి అభినయం, వినాలనిపించే పాటలు మూవీకి పాజిటివ్ టాక్ తీసుకొచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అయితే వేరే లెవల్ అనే చెప్పాలి. ఇవి హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. 

అయితే ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందా..? అని అందరూ తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ‘ఆదిపురుష్‌’ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime videos) దక్కించుకుంది. ఈ  చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. అయితే గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కాస్త లేట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను థియేటర్ లో చూస్తేనే మంచి అనుభూతి కలుగుతుందని మూవీ యూనిట్ చెబుతోంది. దాని ప్రకారం, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్వరుడు పాత్రలో, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు. సుమారు రూ.550 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆదిపురుష్‌ సినిమాను రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మైథలాజికల్ మూవీని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తోంది. 

Also Read: Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..

ప్లస్ పాయింట్స్ 
** ప్రభాస్ నటన
** విజువ‌ల్స్‌ ఎఫెక్ట్స్
 ** సంగీతం, బీజీఎం
మైనస్ పాయింట్స్
** భావోద్వేగాలు మిస్ అవ్వడం
** రన్‌టైమ్ ఎక్కువగా ఉండడం
** సీన్లు ముందే ఊహించడం

Also Read: Adipurush Full HD Print Leaked: ఆదిపురుష్ ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్.. ఇంటర్నెట్లో ఫుల్ మూవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News