Chiranjeevi reacts about Banjarahills School Incident: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై ఇటీవల జరిగిన అఘాయిత్యం అందరినీ కలిచివేసింది. చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మృగాళ్లను కఠినంగా శిక్షించాలన్నారు.
'నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్‌లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా' అంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనలల్ పోస్ట్ చేశారు.
Let such Horrors not recur ever again! pic.twitter.com/s1tzujCevh
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022
చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్‌ను ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రైవర్ రజనీ కుమార్‌తో సహా ప్రిన్సిపల్ ఎస్ మాధవిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దుచేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. స్కూల్‌లోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని అధికారులకు సూచించారు.
Also Read: మాకు కాశ్మీర్ వద్దు.. కొహ్లీని ఇవ్వండి! అవి రెండు దొరకవంటూ భారత్ ఫ్యాన్ కౌంటర్
Also Read: Lunar Eclipse 2022: నవంబర్ 8న చంద్ర గ్రహణం, 15 రోజుల్లో రెండు గ్రహణాల ప్రభావం ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
మృగాళ్లను కఠినంగా శిక్షించాలి.. బంజారాహిల్స్ ఘటనపై చిరంజీవి ఆవేదన!
అఘాయిత్యం నన్ను తీవ్రంగా కలచివేసింది
మృగాళ్లను కఠినంగా శిక్షించాలి
బంజారాహిల్స్ ఘటనపై చిరంజీవి ఆవేదన